Mythri Ravi Shankar: నాని 'నాచుర‌ల్ స్టార్‌'.. కిర‌ణ్ అబ్బవరం 'ఒరిజిన‌ల్ స్టార్‌'

ABN , Publish Date - Jul 20 , 2026 | 08:02 AM

కిరణ్‌ అబ్బవరం, శ్రీ గౌరి ప్రియ జంటగా రూపొందిన ‘చెన్నై లవ్‌స్టోరి’.

Mythri Ravi Shankar

కిరణ్‌ అబ్బవరం (kiran abbavaram), శ్రీ గౌరి ప్రియ (sri gouri priya) జంటగా రూపొందిన ‘చెన్నై లవ్‌స్టోరి’ (Chennai Love Story)చిత్రం ఈ నెల 24న విడుదల కానుంది. రవి నంబూరి దర్శకత్వంలో ఎస్‌.కె.ఎన్‌ నిర్మించారు. ఈ చిత్రం ట్రైలర్‌ను అగ్ర నిర్మాత అల్లు అరవింద్‌ ఆవిష్కరించిన అనంతరం మాట్లాడుతూ ‘ట్రైలర్‌ అద్భుతంగా ఉంది. సినిమా విజయం సాధిస్తుందనే నమ్మకం ఏర్పడింది. ఈ నెల 24న వీరందరికీ ఓ మంచి విజయం దక్కబోతోంది. కిరణ్‌ అబ్బవరం చిత్రంలో చాలా సహజంగా నటించాడు. భవిష్యత్‌లో మంచి స్థాయికి చేరుకుంటాడు’ అని చెప్పారు.

‘ఈ సినిమా కల్ట్‌ బ్లాక్‌ బస్టర్‌ అని మేకర్స్‌ చెబుతున్నారంటే కంటెంట్‌ మీద వారికి ఉన్న నమ్మకమే కారణం. హీరో కిరణ్‌ను ఒరిజనల్‌ స్టార్‌ అని పిలవాలని ఉంది. అతనితో మేం తీసే చిత్రం టైటిల్స్‌లో అలాగే వేస్తాం’ అని ‘మైత్రి’ రవిశంకర్‌ చెప్పారు. ‘చెన్నై లవ్‌స్టోరీ’తో హ్యాట్రిక్‌ కొట్టబోతున్నామని కిరణ్‌ అబ్బవరం చెప్పారు. కంటెంట్‌ మీద అంత నమ్మకంతో ఉన్నామని ఆయన చెప్పారు. ట్రైలర్‌ ఎంత బాగుందో సినిమా అంతకు వంద రెట్లు బాగుంటుందని నిర్మాత ఎస్‌.కె.ఎన్‌. చెప్పారు. ‘మా అందరి జీవితాల్లో పెద్ద విజయాన్ని ఈ సినిమాతో అందుకోబోతున్నాం’ అని సహ నిర్మాత ధీరజ్‌ మొగిలినేని చెప్పారు. సినిమా కంటెంట్‌ చూసి అందరం మురిసిపోతున్నామని నిర్మాత సాయి రాజేశ్‌ తెలిపారు.

Updated Date - Jul 20 , 2026 | 08:34 AM