Samantha: సమంత అప్పుడన్న మాటలు.. ఇప్పుడు వైరల్‌..

ABN , Publish Date - Jun 22 , 2026 | 12:26 PM

అగ్ర కథానాయిక సమంత ఫుల్‌ హ్యాపీ మూడ్‌లో ఉన్నారు. ఆమె కథానాయికగా నటించి, నిర్మించిన ‘మా ఇంటి బంగారం’ సక్సెస్‌ను ఆస్వాదిస్తున్నారు.

Samantha

అగ్ర కథానాయిక సమంత (Samantha) ఫుల్‌ హ్యాపీ మూడ్‌లో ఉన్నారు. ఆమె కథానాయికగా నటించి, నిర్మించిన ‘మా ఇంటి బంగారం’ (Maa inti Bangaram) సక్సెస్‌ను ఆస్వాదిస్తున్నారు. ఇదే తరుణంలో ఆమె తల్లి కాబోతోందనే వార్త కూడా రెండు రోజులుగా నెట్టింట చక్కర్లు కొడుతోంది. ‘మా ఇంటి బంగారం’ షో అనంతరం సామ్‌ బయట వచ్చిన సన్నివేశాలు చూసి ఆమె గర్భవతి అని, బేబీ బంప్‌తో బయటకు వచ్చిందని వార్తలు హల్‌చల్‌ చేశాయి. ఈ ఇదే విషయాన్ని సమంతకు అతి దగ్గరగా ఉండేవారిని అడగగా హింట్‌ ఇచ్చారు. 'సమంత, రాజ్‌లకు ఇది చాలా ప్రత్యేకమైన సమయం. వాళ్లిద్దరూ కొత్త ప్రయాణానికి సిద్థమవుతున్నారు’ అని తెలిపారు. ఈ విషయాన్ని సమంత త్వరలోనే అధికారికంగా ప్రకటిస్తారని భావిస్తున్నారు అభిమానులు.

ఈ నేపథ్యంలో తనకు పుట్టే పిల్లల గురించి గతంలో సమంత చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్‌ అవుతున్నాయి. ఆమె మాట్లాడుతూ ‘నా బాల్యాన్ని తలుచుకోవడం నాకు అంతగా నచ్చదు. ఎందుకంటే చిన్నతనం అంతా కష్టంగానే సాగింది. అలాంటి బాల్యం గడిపిన వారంతా వారి పిల్లలకు మంచి లైఫ్‌ ఇవ్వాలని, వారి జీవితం సౌకర్యవంతంగా ఉండాలని అనుకుంటారు. నాకు బిడ్డ పుట్టిన తర్వాత కొన్ని సంవత్సరాల పాటు తనను వదిలి ఎక్కడికీ వెళ్లను. తనే నా సర్వస్వంగా చూసుకుంటా. నా బిడ్డే నా ప్రపంచం అవుతుంది’ అని అన్నారు. అలాగే ఉద్యోగం చేసుకుంటూ పిల్లలను, ఇంటి బాధ్యతలను చూసుకునే ఆడవారంటే ఎంతో గౌరవమని ఆమె అన్నారు.

ఇదిలా ఉంటే 'మా ఇంటి బంగారం' చిత్రంపై సెలబ్రిటీలు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు. తాజాగా నయనతార స్పందించారు. ‘సామ్‌ నీ విషయంలో ఎంతో హ్యాపీగా ఉంది. ఈ విజయానికి నువ్వు అర్హురాలివి’ అని పోస్ట్‌ పెట్టారు. దీనికి సమంత స్పందిస్తూ ‘డార్లింగ్‌ నయన్‌’ అంటూ హార్ట్‌ ఎమోజీలను జోడించారు. మూడు రోజుల్లో ఈ చిత్రం రూ.28 కోట్లు వసూలు చేసింది.

Updated Date - Jun 22 , 2026 | 01:16 PM