హీరోయిన్ తో థమన్ స్టెప్పులు.. హీరో అయిపో అన్నా
ABN , Publish Date - Oct 09 , 2026 | 07:33 PM
కొత్త హీరో అనీష్, అనస్వరా రాజన్ (Anaswara Rajan) జంటగా మహేష్ ఉప్పల దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ లవ్ ఎంటర్‌టైనర్ ఇట్లు అర్జున (Itlu Arjuna).
కొత్త హీరో అనీష్, అనస్వరా రాజన్ (Anaswara Rajan) జంటగా మహేష్ ఉప్పల దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ లవ్ ఎంటర్‌టైనర్ ఇట్లు అర్జున (Itlu Arjuna). వెంకీ కుడుముల నిర్మాణంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాకి మ్యూజిక్ సెన్సేషన్ ఎస్.ఎస్. థమన్ సంగీతం వహించాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ అయిన టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ చిత్రం నుంచి ఎల్లో చున్నీ అంటూ సాగే సాంగ్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ సాంగ్ ఈవెంట్ లో హీరో కన్నా థమన్ ఎక్కువగా సందడి చేసి సోషల్ మీడియాలో హైలైట్ గా నిలిచాడు.
ఈ వేడుకలో థమన్, ఈ చిత్ర హీరోయిన్ అనస్వరా రాజన్ తో కలిసి మాస్ డ్యాన్స్ వేసి అభిమానులను, చిత్రబృందాన్ని ఖుషీ చేశాడు. సూపర్ స్టార్ మహేష్ బాబు బ్లాక్‌బస్టర్ హిట్ మూవీ సర్కారు వారి పాటలోని కమాన్ కమాన్ కళావతి చాట్‌బస్టర్ సాంగ్‌కు థమన్, అనస్వరా ఇద్దరూ కలసి సిగ్నేచర్ స్టెప్పులేశారు. థమన్ డ్యాన్స్ చూసి అక్కడున్న ఆడియన్స్, యూనిట్ సభ్యులు ఈలలు, కేరింతలతో రచ్చ చేశారు. అనస్వరా రాజన్ క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్, థమన్ సరదా జోష్ ఈవెంట్‌కే ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
దీనికి సంబంధించిన వీడియోలు, క్లిప్పింగ్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి. సూపర్ స్టార్ ఫ్యాన్స్ అయితే కళావతి వైబ్స్ ఆర్ బ్యాక్ అని అంటుండగా.. మరికొందరు థమన్ అన్నా హీరో అయిపో అంటూ సరదాగా కామెంట్స్ పెడుతున్నారు. ఒక పక్క బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, చార్ట్‌బస్టర్ సాంగ్స్‌తో అలరించే థమన్, ఇలా వేదికపై సరదాగా అనస్వరాతో స్టెప్పులేయడం ఈవెంట్‌ను నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్లింది. ఇకపోతే ఇట్లు అర్జున అక్టోబర్ 30 న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమాతో అనీష్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.