Lenin: అందరూ ఉన్నారు.. అసలు డైరెక్టర్ ఎక్కడ
ABN , Publish Date - Jul 05 , 2026 | 07:03 PM
అక్కినేని అఖిల్ (Akkineni Akhil) దాదాపు మూడేళ్ళ తరువాత నటించిన చిత్రం లెనిన్ (Lenin). మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీతో కలిసి అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna) ఈ సినిమాను నిర్మించాడు.
అక్కినేని అఖిల్ (Akkineni Akhil) దాదాపు మూడేళ్ళ తరువాత నటించిన చిత్రం లెనిన్ (Lenin). మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీతో కలిసి అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna) ఈ సినిమాను నిర్మించాడు. ఇక ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటించింది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఎన్నో వాయిదాల తరువాత లెనిన్ జులై 10 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండడంతో ప్రమోషన్స్ మొదలుపెట్టిన అఖిల్.. చిన్నా, పెద్ద అనే తేడా లేకుండా అన్నీ యూట్యూబ్ ఛానెల్స్ కి ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు
సాధారణంగా సినిమా ప్రమోషన్ అంటే.. హీరో, హీరోయిన్ తో పాటు ఎక్కువగా డైరెక్టర్ కూడా కనిపిస్తాడు. అన్నీ ఇంటర్వ్యూలలో కనిపించకపోయినా.. కనీసం కొన్ని ఇంటర్వ్యూలలో డైరెక్టర్ కనిపిస్తాడు. కానీ లెనిన్ విషయంలో ఇది జరగలేదు. ఇప్పటివరకు బయటకు వచ్చిన ఏ ఇంటర్వ్యూలో కూడా మురళీ కిషోర్ కనిపించలేదు. చివరికి నిర్మాత అయిన సూర్యదేవర నాగవంశీ కూడా ఇంటర్వ్యూ ఇచ్చాడు కానీ, డైరెక్టర్ మాత్రం కనిపించలేదు. దీంతో ఫ్యాన్స్ లో కొత్త అనుమానం రేకెత్తుతోంది.
అసలు డైరెక్టర్ ఎక్కడ.. ఇక నేడు లెనిన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ తిరుపతిలో జరగనుంది. ఈ ఈవెంట్ కి నాగవంశీ, నాగార్జున, భాగ్యశ్రీ, అఖిల్ తో పాటు బ్రహ్మాజీ, సునీల్ కూడా ఫ్లైట్ లో కనిపించారు. ఆ ఫోటోను సితార ఎంటర్ టైన్మెంట్స్ పోస్ట్ చేస్తూ .. తిరుపతి రెడీగా ఉన్నారా.. మేము వస్తున్నాం అని రాసుకొచ్చారు. కానీ, ఆ ఫోటోలో డైరెక్టర్ మాత్రం లేడు. సరే ఫోటో తీస్తున్నాడేమో అనుకుంటే.. ఆ ఫోటో తీసింది అమల అని క్లారిటీ ఇచ్చారు. అయితే అసలు మురళీ కిషోర్ కి ఏమైంది.. నిర్మాతలకు, డైరెక్టర్ కి మధ్య విభేదాలు ఏమైనా తలెత్తాయా.. ? ఒకసారి కాకపోయినా ఒకసారి అయినా కనిపించాలి కదా అని ఫ్యాన్స్ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి అయినా డైరెక్టర్ వస్తాడా.. ? రాడా అనేది తెలియాల్సి ఉంది. ఒకవేళ రాకపోతే మాత్రం లెనిన్ సినిమాపై లేనిపోని రూమర్స్ రావడం ఖాయమని నెటిజన్స్ చెప్పుకొస్తున్నారు. మరి ఇందులో ఎంతవరకు నిజముందో చూడాలి.