Mrunal Thakur: ధనుష్ తో పెళ్లి.. ఎట్టకేలకు స్పందించిన మృణాల్
ABN , Publish Date - Jan 18 , 2026 | 04:58 PM
ఇండస్ట్రీలో ఒక రూమర్ వచ్చింది అంటే.. అది దావానంలా పాకిపోతుంది. కొన్నిరోజులుగా బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur).. కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ (Dhanush)పెళ్లి చేసుకోబోతున్నారు అన్న వార్త సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
Mrunal Thakur: ఇండస్ట్రీలో ఒక రూమర్ వచ్చింది అంటే.. అది దావానంలా పాకిపోతుంది. కొన్నిరోజులుగా బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur).. కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ (Dhanush)పెళ్లి చేసుకోబోతున్నారు అన్న వార్త సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. వీరిద్దరూ కలిసి రెండుసార్లు కనిపించారో లేదో ఇద్దరి మధ్య ప్రేమాయణం నడుస్తుందని రూమర్ క్రియేట్ చేశారు. ఇక ఆ రూమర్ ని వారిద్దరూ ఖండించకపోవడంతో ఫిబ్రవరి 14 పెళ్లి కూడా చేసుకుంటున్నారని మరో పుకారును సృష్టించారు. ఇక మృణాల్ అయితే ఈ వార్తలకు ఆజ్యం పోసినట్లు.. ఆమె పెట్టే ప్రతి పోస్ట్ కి తమిళ్ సాంగ్ ని యాడ్ చేయడంతో.. తమిళమ్మాయిగా మారుతుందిగా.. అందుకే పెడుతుంది అని కామెంట్స్ చేయడం మొదలుపెట్టారు.
ఇక ధనుష్ ఎప్పుడు .. రూమర్స్ మీద ఎక్కువ స్పందించడు. తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోతాడు. మృణాల్ సైతం మొదట్లో ఈ రూమర్స్ ని ఈజీగా తీసుకున్నా.. పెళ్లి వార్తలను కొంచెం సీరియస్ గానే తీసుకున్నట్లు కనిపిస్తుంది. తాజాగా మృణాల్ టీమ్.. ఈ పెళ్లి వార్తలను ఖండించింది. ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని తెలిపింది. ' మృణాల్ - ధనుష్ పెళ్లి అంటూ వస్తున్న వార్తలో ఎలాంటి నిజం లేదు. ఫిబ్రవరి 14 న మృణాల్ పెళ్లి చేసుకోవడంలేదు. వచ్చే నెల ఆమె కొత్త సినిమా రిలీజ్ కు సిద్దమవుతుంది. ఇంకో సినిమా సెట్స్ మీద ఉంది. ఇలాంటి సమయంలో పెళ్లి ఎలా చేసుకుంటుంది. లాజిక్ ఉందా.. ఇక ఈ వార్తను వదిలేయండి. మృణాల్ అప్పుడే పెళ్లి చేసుకోవాలనే ఆలోచనలో లేదు. ఇలాంటి ఆధారాలు లేని వార్తలను నమ్మకండి' అంటూ చెప్పుకొచ్చారు. దీంతో ఈ రూమర్స్ కి చెక్ పడినట్లు అయ్యింది.
ధనుష్ సన్నహితులు సైతం ఇదే మాట చెప్పుకొస్తున్నారు. ఈ వార్తల్లో నిజం లేదు. ఫేక్.. బేస్ లెస్ న్యూస్ అంటూ కొట్టిపారేస్తున్నారు. మరి వీరి పెళ్లి నిజంగా జరుగుతుందా .. ? లేదా అనేది తెలియాలంటే వచ్చే నెలవరకు ఆగాల్సిందే.