Mrunal Thakur: మృణాల్‌తో సినిమా అంటే హీరోలు జాగ్రత్తగా ఉండాల్సిందే!

ABN , Publish Date - Apr 16 , 2026 | 09:43 PM

ప్రస్తుతం మృణాల్ ఠాకూర్ పేరు ఇండస్ట్రీ వర్గాల్లో ఎలా వినిపిస్తుందో తెలిసిందే. రీసెంట్‌గా ధనుష్‌తో పెళ్లి అంటూ ఆమెపై వార్తలు వచ్చాయి. ఆ వార్తలకి ఎలాగోలా స్టాప్ పెట్టిన మృణాల్.. ఇప్పుడు తన సినిమాలతో చర్చల్లో నిలుస్తున్నారు.

Heroine Mrunal Thakur

టాలీవుడ్ సెన్సేషనల్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్‌ (Mrunal Thakur)తో సినిమాలు చేసే హీరోలు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే, సెంటిమెంట్ అలా నడుస్తుంది. ప్రస్తుతం మృణాల్ ఠాకూర్ పేరు ఇండస్ట్రీ వర్గాల్లో ఎలా వినిపిస్తుందో తెలిసిందే. రీసెంట్‌గా ధనుష్‌ (Dhanush)తో పెళ్లి అంటూ ఆమెపై వార్తలు వచ్చాయి. ఆ వార్తలకి ఎలాగోలా స్టాప్ పెట్టిన మృణాల్.. ఇప్పుడు తన సినిమాలతో చర్చల్లో నిలుస్తున్నారు. అడివి శేష్ సరసన హీరోయిన్‌గా నటించిన ‘డెకాయిట్’ చిత్రం థియేటర్లలో విడుదలై.. సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో మృణాల్ యమా యాక్టివ్‌గా పాల్గొంటున్నారు. అలా ఓ ఈవెంట్‌లో తెలుగు హీరోనే పెళ్లి చేసుకుంటుందని, మృణాల్‌పై అల్లు అరవింద్ (Allu Aravind) చేసిన కామెంట్స్‌ బాగా వైరల్ అయిన విషయం తెలిసిందే. దీంతో తెలుగు ప్రేక్షకులు ఆమెపై ఇంకాస్త ఇంట్రెస్ట్ పెడుతున్నారు. ప్రస్తుతం ‘పెద్ది’ (Peddi) సినిమాలో స్పెషల్ ‌సాంగ్‌కు ఈ అందాల భామ సెలక్ట్ అయినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే, తాజాగా తన సినిమాల్లోని ఒక వింత సెంటిమెంట్ (Mrunal Thakur Sentiment) గురించి ఈ భామ బయటపెట్టి అందరినీ ఆశ్చర్యపరిచింది.


తాజాగా జరిగిన ఒక ఇంటర్వ్యూలో మృణాల్ మాట్లాడుతూ.. తన స్నేహితులు తనను సరదాగా ‘హస్బెండ్ మర్డరర్’ (భర్తలను చంపేసే భార్య) అని ఆటపట్టిస్తుంటారని నవ్వుతూ చెప్పింది. అందుకు కారణం ఆమె నటించిన వరుస సినిమాలు, అందులో హీరోల పాత్రల ముగింపేనని అంటోంది. ఆ వివరాల్లోకి వెళితే.. హిందీ ‘జెర్సీ’ సినిమాలో షాహిద్ కపూర్ పాత్ర చివరికి చనిపోతుంది. ‘సీతారామం’ వంటి బ్లాక్ బస్టర్ హిట్ మూవీలో కూడా దుల్కర్ సల్మాన్ పాత్ర ప్రాణాలు విడుస్తుంది. అలాగే ‘ధమాకా’లో కార్తీక్ ఆర్యన్ పాత్ర కూడా అంతే! ఇక తాజాగా విడుదలైన ‘డెకాయిట్’ సినిమాలో కూడా హీరో అడవి శేష్ పాత్రకు ఇదే గతి పట్టింది.


‘‘సీతారామంలో రామ్ చనిపోయారు.. ఇప్పుడు అడవి శేష్ పాత్ర కూడా అంతే! నా సినిమాల్లో హీరోలందరినీ ఇలా చంపేస్తున్నందుకు నా ఫ్రెండ్స్ నన్ను ఆటపట్టిస్తున్నారు’’ అంటూ మృణాల్ సరదాగా చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోకు నెటిజన్లు కూడా సరదాగా రియాక్ట్ అవుతున్నారు. మృణాల్‌తో కలిసి నటించే హీరోలు తమ పాత్రల విషయంలో కాస్త జాగ్రత్తలు తీసుకోవాలంటూ నెటిజన్లు చేసే కామెంట్స్‌తో ఈ వీడియో బాగా చక్కర్లు కొడుతోంది.

ఇవి కూడా చదవండి:

Balakrishna: ‘రూటు’ మార్చిన బాలయ్య.. కొడుకు కథను పక్కన పెట్టి.. తనే ఆ దర్శకుడితో?

Rashmika Mandanna: రష్మికకు పిచ్చెక్కించేశారట.. పోస్ట్ వైరల్!

మంగ్లీకి మరో షాక్ ఇచ్చిన అడ్వొకేట్‌ సుబ్బారావు.. ఈ ట్విస్ట్ ఏంటయ్యో!

Updated Date - Apr 16 , 2026 | 09:43 PM

Mrunal Thakur: అలాంటి లక్ష్యాలు లేవు.. అమ్మా, అక్క దేనికైనా రెడీ!

Mrunal Thakur: ఫోటో ఎడిట్.. మండిపడ్డ మృణాల్‌ ఠాకూర్‌

Mrunal Thakur: కంటి నిండా నిద్ర కోసం ఆరాటపడ్డాను

Mrunal Thakur: ముద్దు సన్నివేశాల గురించి మృణాల్‌ ఏమన్నారంటే!

Mrunal Thakur: రొమాన్స్ అంటే ఏంటో తెలుసా?