Mr work From Home: సాఫ్ట్‌వేర్ జీవనశైలికి.. వ్యవసాయానికి మధ్య సంబంధం
ABN , Publish Date - Feb 02 , 2026 | 10:11 PM
త్రిగుణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్’. మధుదీప్ చెలికాని దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రమిది
త్రిగుణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్’. మధుదీప్ చెలికాని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం, ఆధునిక సాఫ్ట్‌వేర్ జీవనశైలికి, గ్రామీణ మూలాలైన వ్యవసాయానికి మధ్య ఉన్న సంబంధాన్ని సరికొత్త కోణంలో ఆవిష్కరించనుంది. లోటస్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్‌పై అరవింద్ మండెం నిర్మిస్తున్న ఈ చిత్రంలో పాయల్ రాధాకృష్ణ హీరోయిన్‌గా నటించగా, అనీష్ కురువిల్లా, శివాజీ రాజా ఇతర కీలక పాత్రలు పోషించారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. వైజాగ్ లో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేసింది చిత్ర బృందం. 'వ్యవసాయం చేసే విధానం మారితే, దాన్ని చూసే తీరు మారుతుంది' వంటి డైలాగులు ప్రేక్షకులలో ఆలోచన రేకెత్తిస్తున్నాయి.
దర్శకుడు మాట్లాడుతూ 'సిటీలో సెటిల్ అవ్వాలనే ఆలోచన పక్కన పెట్టి, వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తూనే తన ఊరిలో వ్యవసాయాన్ని కొత్త పుంతలు తొక్కించే యువకుడి కథా నేపథ్యంతో ఈ సినిమా రూపొందింది' అని అన్నారు.
నిర్మాత మాట్లాడుతూ 'సొసైటీకి చక్కని సందేశం ఇచ్చే సినిమా ఇది. ఈ నెల 13న సినిమా విడుదల చేస్తున్నాం' అని అన్నారు.