మోక్షజ్ఞ ఎంట్రీ.. బాలయ్య మాస్టర్ ప్లాన్! సర్వం సిద్ధం

ABN , Publish Date - Apr 05 , 2026 | 10:36 AM

కొన్నేళ్లుగా నందమూరి అభిమానులు ఒక్కటే ప్రశ్న అడుగుతున్నారు.. మోక్షజ్ఞ ఎంట్రీ ఎప్పుడు అని..? ఆ నిరీక్షణకు ఇప్పుడు బ్రేక్ పడబోతోందని, ఈ ఏడాదే మోక్షజ్ఞ గ్రాండ్‌ ఎంట్రీ ఇవ్వబోతున్నారని టాక్‌ వినిపిస్తుంది.

Balakrishna

నందమూరి తారక రామారావు గారి వారసత్వం.. నటసింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) గారి నట ప్రస్థానం.. ఇప్పుడు ఈ లెగసీని ముందుకు తీసుకెళ్లేందుకు నందమూరి వారసుడు సిద్ధమయ్యాడు. గత కొన్నేళ్లుగా నందమూరి అభిమానులు ఒక్కటే ప్రశ్న అడుగుతున్నారు.. మోక్షజ్ఞ (Mokshagna) ఎంట్రీ ఎప్పుడు అని..? ఆ నిరీక్షణకు ఇప్పుడు బ్రేక్ పడబోతోందని, ఈ ఏడాదే మోక్షజ్ఞ గ్రాండ్‌ ఎంట్రీ ఇవ్వబోతున్నారని టాక్‌ వినిపిస్తుంది.

నిజానికి, అనుకున్నది అనుకున్నట్లుగా జరిగి ఉంటే.. ఈపాటికే మోక్షజ్ఞ మొదటి సినిమా థియేటర్లలో సందడి చేసేది. కొన్ని కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదు. దాంతో తన వారసుడిని గ్రాండ్ గా లాంచ్ చేసే బాధ్యతను స్వయంగా బాలయ్యే భుజాన వేసుకున్నారు. ఊరికే లాంచ్ చేస్తే సరిపోదు.. అది ఒక కల్ట్ క్లాసిక్ కావాలని డిసైడ్ అయ్యారు. అందుకే, బాలకృష్ణ కెరీర్ లోనే వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ మూవీ అయిన ఆదిత్య 369 కి సీక్వెల్ గా ఆదిత్య 999 మ్యాక్స్ (Aditya 999) ను సిద్ధం చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌తో మోక్షజ్ఞ కు గ్రాండ్‌ ఎంట్రీ ఇవ్వాలని బాలయ్య భావిస్తున్నారు.

ఈ పవర్ ఫుల్ ప్రాజెక్ట్ కు టాలెంటెడ్ డైరెక్టర్ క్రిష్ (Krish Jagarlamudi) దర్శకత్వం వహించబోతున్నారనే వార్త ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. గౌతమీపుత్ర శాతకర్ణి లాంటి హిస్టారికల్ మూవీతో బాలయ్యకు మర్చిపోలేని హిట్ ఇచ్చిన క్రిష్.. ఇప్పుడు మోక్షజ్ఞ కోసం ఒక అద్భుతమైన కథను సిద్ధం చేశారట. అంతేకాకుండా సాయి మాధవ్ బుర్రా (Sai Madhav Burra) ఈ సినిమాకు డైలాగ్స్ అందిస్తున్నారు.

అభిమానుల్లో ఉన్న అతిపెద్ద క్యూరియాసిటీ మోక్షజ్ఞ లుక్..! ఈ సినిమా కోసం మోక్షజ్ఞ తన బాడీ లాంగ్వేజ్ పై, లుక్స్ పై చాలా వర్క్ చేశారని సమాచారం. మోక్షజ్ఞ చాలా స్టైలిష్‌గా, ట్రెండీగా కనిపించబోతున్నారని తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో బలమైన క్యాస్టింగ్ ఉండబోతోంది. బాలయ్య సైతం ఈ సినిమాలో నటిస్తాడా..లేక ఏదైనా స్పెసిఫిక్‌ రోల్‌కు పరిమితమవుతారేమో చూడాలి. అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రాకపోయినప్పటికీ.. ఫిలిం నగర్ సమాచారం ప్రకారం ఈ సినిమా ప్రీ-ప్రొడక్షన్ పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. అంతా సవ్యంగా జరిగితే, ఈ ఏప్రిల్ నెలలోనే సినిమా గ్రాండ్ గా స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది.

గతంలో బాలయ్య ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. మోక్షజ్ఞను ఎలా ఇంట్రడ్యూస్ చేయాలో నాకు తెలుసు.. నా మైండ్ లో ఐదారు స్క్రిప్ట్స్ రెడీగా ఉన్నాయి అని చెప్పారు. ఆ మాటలకు తగ్గట్లే ఈ లాంచింగ్ భారీగా ఉండబోతోంది. టైమ్ మెషీన్ బ్యాక్ డ్రాప్ లో వచ్చే ఈ సోషియో ఫాంటసీ మూవీ నందమూరి అభిమానులకు ఒక బిగ్ ట్రీట్ అని చెప్పడంలో సందేహం లేదు. చాలామందికి తెలిసిన విషయమే ఏంటంటే.. నందమూరి వంశం నుండి వచ్చే ఏ హీరోకైనా అభిమానుల మద్దతు భారీగా ఉంటుంది. మరి మోక్షజ్ఞ తన తాతగారి పేరును, తండ్రిగారి క్రేజ్ ను ఏ స్థాయిలో నిలబెడతారో చూడాలి.

Updated Date - Apr 05 , 2026 | 11:07 AM