Mohanbabu: మోహన్ బాబుకు.. గవర్నర్ ఎక్సలెన్స్ అవార్డు

ABN , Publish Date - Jan 25 , 2026 | 11:09 PM

ప్రముఖ నటుడు మోహన్ బాబు కు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం గవర్నర్ ఎక్సలెన్స్ అవార్డు ప్రకటించింది.

mohanbabu

తెలుగు సినీ పరిశ్రమలో తనదైన నటన, సేవా కార్యక్రమాలతో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ప్రముఖ నటుడు మోహన్ బాబు (Mohan Babu) కు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ప్రతిష్టాత్మక గవర్నర్ ఎక్సలెన్స్ అవార్డు (West Bengal’s Governor’s Award of Excellence)ను ప్రదానం చేయనున్నట్లు ప్రకటించింది.

గణతంత్ర దినోత్సవం సందర్భంగా జనవరి 26, 2026న కోల్‌కతాలోని లోక్ భవన్‌లో నిర్వహించనున్న ప్రత్యేక కార్యక్రమంలో ఈ అవార్డును అధికారికంగా అందజేయనున్నారు. కళా, సంస్కృతి, సమాజ సేవా రంగాల్లో మోహన్ బాబు చేసిన విశేష కృషిని గుర్తిస్తూ ఈ గౌరవాన్ని అందించనున్నట్లు సమాచారం.

మోహన్ బాబు తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటించి ప్రేక్షకుల మనసులను గెలుచుకున్నారు. నటుడిగా మాత్రమే కాకుండా, నిర్మాతగా, విద్యా రంగంలో సేవలు అందించే వ్యక్తిగా కూడా ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది.

పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం అందిస్తున్న ఈ పుర‌స్కారం మోహన్ బాబు కెరీర్‌లో మరో గొప్ప మైలురాయి కానుంది. తెలుగు ప్రజలతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న ఆయ‌న అభిమానులు ఈ అవార్డు ప్రకటనపై హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - Jan 25 , 2026 | 11:09 PM