Srinivasa Mangapuram: మోహన్ బాబుకు ఏమైంది..

ABN , Publish Date - Jul 25 , 2026 | 09:04 PM

అజయ్ భూపతి (Ajay Bhupathi) దర్శకత్వంలో జయకృష్ణ (Jayakrishna), రషా తడానీ జంటగా నటించిన క్రేజీ ప్రాజెక్ట్ శ్రీనివాస మంగాపురం (Srinivasa Mangapuram) జులై 30న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది.

Mohan Babu

అజయ్ భూపతి (Ajay Bhupathi) దర్శకత్వంలో జయకృష్ణ (Jayakrishna), రషా తడానీ జంటగా నటించిన క్రేజీ ప్రాజెక్ట్ శ్రీనివాస మంగాపురం (Srinivasa Mangapuram) జులై 30న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. ఈ చిత్రంలో వర్సటైల్ యాక్టర్, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు (Mohan Babu) శక్తివంతమైన విలన్ పాత్రలో నటించడం సినిమాపై భారీ అంచనాలను పెంచేసింది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్స్, ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండడంతో ప్రమోషన్స్ స్పీడు పెంచిన మేకర్స్ .. వరుస ఇంటర్వ్యూలు ఇచ్చే పనిలో పడ్డారు. ఇక మొదటి నుంచి కూడా జయకృష్ణ, రషా తడానీనే అన్నీ ఇంటర్వ్యూలలో కనిపిస్తున్నారు. కానీ, మోహన్ బాబు ఎక్కడా కనిపించడం లేదు. విడుదల తేదీ అత్యంత సమీపంలోకి వచ్చినప్పటికీ, చిత్రయూనిట్ నిర్వహిస్తున్న ప్రమోషన్లలో మోహన్ బాబు ఎక్కడా కనిపించకపోవడం టాలీవుడ్‌లో పెద్ద చర్చనీయాంశంగా మారింది.


ప్రమోషన్స్ విషయంలో మోహన్ బాబు ఎక్కడా తగ్గడు. ఆయన పాత్ర కూడా తక్కువేమీ కాదు. అసలు మోహన్ బాబు విలన్ గా కనిపిస్తున్నాడు అనేసరికి శ్రీనివాస మంగాపురంకు హైప్ మరింత ఎక్కువ అయ్యింది. ట్రైలర్ లో ఆయన విలనిజం చూసి అంచనాలు ఆకాశాన్ని తాకాయి. విలన్ గా కెరీర్ ని మొదలుపెట్టి హీరోగా మారిన ఆయన.. ఇప్పుడు మళ్లీ విలన్ గా రీఎంట్రీ ఇవ్వనున్నాడు. ఇక అంత మంచి పాత్ర చేస్తున్నా కూడా మోహన్ బాబు ఎందుకు ప్రమోషన్స్ లో కనిపించడం లేదు.


ఒకవేళ మేకర్స్ తో మోహన్ బాబుకు ఏమైనా విభేదాలు తలెత్తేయా అంటే అజయ్ భూపతి తాజాగా మోహన్ బాబు నటనపై పెద్ద నోట్ రాసుకొచ్చాడు. దీంతో ఎలాంటి విభేదాలు లేవని తెలుస్తున్నాయి. పోనీ ప్యారడైజ్ షూటింగ్ షెడ్యూల్స్, ఇతర ప్రాజెక్ట్ పనుల్లో బిజీగా ఉండటం వల్లే ప్రమోషన్లకు దూరంగా ఉన్నాడా అంటే.. ఏమో అది కూడా నిజమే కావచ్చు. ప్రస్తుతం మోహన్ బాబు.. మంచి మంచి కథలను అందుకుంటూ నటుడిగా బిజీగా మారుతున్నాడు. అయితే మొదటి రీఎంట్రీ.. అందులోనూ విలన్ గా చేస్తున్నాడు అంటే ఈ సినిమా చాలా ప్రాముఖ్యత కలిగి ఉంది. అలాంటి సినిమాకు ప్రమోషన్స్ కూడా చేయకపోతే ప్రేక్షకులు ఎలా ఆయనను ఓన్ చేసుకుంటారు అని కొందరు చెప్పుకొస్తున్నారు. మరి ముందు ముందు ఏమైనా మోహన్ బాబు ఇంటర్వ్యూలలో కానీ, ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కానీ కనిపిస్తాడేమో చూడాలి.

Updated Date - Jul 25 , 2026 | 09:06 PM