MohanBabu: మోహన్ బాబుకు గవర్నర్ ఎక్సలెన్స్ అవార్డు
ABN , Publish Date - Jan 27 , 2026 | 04:12 PM
మంచు మోహన్ బాబుకి అరుదైన గౌరవం దక్కింది. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం నుండి ప్రతిష్టాత్మక గవర్నర్ అవార్డు ఆఫ్ ఎక్సలెన్స్‌ను లెజెండరీ యాక్టర్ డా. ఎం.మోహన్ బాబు అందుకున్నారు.
మంచు మోహన్ బాబుకి (Mohan babu) అరుదైన గౌరవం దక్కింది. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం నుండి ప్రతిష్టాత్మక గవర్నర్ అవార్డు ఆఫ్ ఎక్సలెన్స్‌ను (Governor's Award of Excellence) లెజెండరీ యాక్టర్ డా. ఎం.మోహన్ బాబు అందుకున్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా కోల్‌కత్తాలోని లోక్ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో ఆయనకు ఈ పురస్కారం దక్కింది. పశ్చిమ బెంగాల్ గవర్నర్ ఈ అవార్డును విశిష్ట అతిథుల మధ్య ప్రదానం చేశారు. తర్వాత సంప్రదాయ ఎట్ హోమ్‌లో రిసెప్షన్ జరిగింది. ఈ కార్యక్రమంలో మోహన్ బాబు కుమారుడు, మా అధ్యక్షుడు విష్ణు మంచు, మా కోశాధికారి శివ బాలాజీ సందడి చేశారు.
ప్రస్తుతం భారతదేశం అంతటా తెలుగు సినిమా హవా నడుస్తోంది. ఈ క్రమంలో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఒక తెలుగు నటుడికి ఇటువంటి గౌరవాన్ని ప్రదానం చేయడం ఓ ప్రత్యేకతను చాటుకున్నట్లు అయింది. కళకు, కళాకారులకు హద్దులు ఉండవని, భాషా సరిహద్దులు ఉండవని, అంతా ఒక్కటే అనే గణతంత్ర దినోత్సవ సారాంశాన్ని ఈ కార్యక్రమం ప్రతిబింబిస్తుంది. మోహన్ బాబు ఈ అవార్డుని అందుకోవడంతో టాలీవుడ్ సెలెబ్రిటీలు, ఆయన అభిమానులు అభినందనలు తెలుపుతున్నారు.