The Paradise: 'ద ప్యారడైజ్‌'కు మైనర్లు.. రంగంలోకి పోలీసులు

ABN , Publish Date - Sep 25 , 2026 | 10:45 AM

నేచురల్ స్టార్ నాని నటించిన ‘ది ప్యారడైజ్’ చిత్రం విడుదలైన తొలి రోజే హైదరాబాద్‌లో ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది.

nani the parasise

నేచురల్ స్టార్ నాని నటించిన ‘ది ప్యారడైజ్’ చిత్రం విడుదలైన తొలి రోజే హైదరాబాద్‌లో ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ది ప్యారడైజ్ (The paradise) చిత్రం చూసేందుకు కొందరు మైనర్లు సుచిత్ర సర్కిల్‌లోని టీఎన్ఆర్ (సినీపోలీస్) మల్టీప్లెక్స్ (TNR Northcity Mall & Multiplex) లో అన్‌లైన్‌లో టికెట్లు బుక్ చేసుకున్నారు.

నిబంధనల ప్రకారం సినిమా చూసేందుకు మైనర్లకు అనుమతి లేకపోవడంతో గుర్తించిన సినీ పోలీస్ యాజమాన్యం మైనర్లను అనుమతించలేదు. దీంతో సినీ పోలీస్ వద్ద తీవ్రవాగ్వాదం, గందరగోళం చోటు చేసుకున్నాయి. గొడవ గమనించిన స్థానికులు, ప్రేక్షకులు 100 డయల్‌కు సమాచారం అందించారు.

డయల్ 100 ద్వారా సమాచారం అందుకున్న పేట్ బషీరాబాద్ పోలీసులు సినిమా థియేటర్ వద్దకు వచ్చి ఇరువర్గాలకు సర్ది చెప్పే ప్రయత్నం చేయగా దాదాపు పదిమంది మైనర్ల తల్లిదండ్రులు టికెట్లు బుకింగ్ డబ్బులు తిరిగి ఇవ్వాలని యాజమాన్యాన్ని నిలదీశారు. దీంతో గందరగోళం నెలకొనడంతో పోలీసులు యాజమాన్యంతో డబ్బులు ఇప్పించారు. దీంతో సినీ పోలీస్‌లో 7.30 గంటలకు ప్రారంభం కావాల్సిన షో ఆలస్యంగా ప్రారంభమైంది.

Updated Date - Sep 25 , 2026 | 11:01 AM