కొండా ‘రుద్ర’ పుస్తకాన్ని.. ఆవిష్కరించిన మెగాస్టార్ చిరంజీవి
ABN , Publish Date - Feb 09 , 2026 | 07:35 AM
మెగాస్టార్ చిరంజీవి ‘రుద్ర’ పుస్తకాన్ని ఆవిష్కరించారు. మంత్రి కొండా సురేఖ కుమార్తె సుస్మిత పటేల్ రచించిన ఈ పుస్తకం శివపురాణంపై యువతకు అవగాహన కల్పించేందుకు రూపొందింది.
తెలంగాణ అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ (Konda Surekha) కుమార్తె కొండా సుస్మిత పటేల్ ( Konda susmita patel) రచించిన ‘రుద్ర’ (Rudra book ) అనే ఆధ్యాత్మిక పుస్తకం ఆవిష్కరణ ఆదివారం మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) చేతులమీదుగా జరిగింది. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ, భారతీయ ఆధ్యాత్మికత, సాంస్కృతిక సంప్రదాయాలను యువతకు చేరువ చేసే ప్రయత్నంగా ఈ పుస్తకం రూపొందించడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. నేటి యువతకు విలువలు తెలియజేసే ఇటువంటి గ్రంథాలు ఎంతో అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. రచయిత్రి సుస్మిత పటేల్ చేసిన కృషిని ప్రత్యేకంగా ప్రశంసించారు.
పుస్తక విడుదల కార్యక్రమానికి సంబంధించిన వివరాలను మంత్రి కొండా సురేఖ తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతా ద్వారా వెల్లడించారు. పుస్తకావిష్కరణకు అంగీకరించినందుకు చిరంజీవికి మంత్రి కొండా సురేఖ కృతజ్ఞతలు తెలిపారు. శివపురాణంలోని అంశాలను సులభంగా అర్థమయ్యేలా యువతకు అందించాలనే లక్ష్యంతో సుస్మిత ఈ పుస్తకాన్ని రచించారని ఆమె పేర్కొన్నారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి మంచి రచనలు చేయాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్ అవుతోంది.