తెలుగు రాష్ట్రాల్లో.. 'వారణాసి' అన్ని కోట్ల బిజినెస్సా? జక్కన్న అంటే.. ఆ మాత్రం ఉంటది మరి!

ABN , Publish Date - Sep 06 , 2026 | 11:29 PM

'వారణాసి' ప్రీ-రిలీజ్ బిజినెస్‌కి సంబంధించి ఒక మైండ్ బ్లాకింగ్ న్యూస్ బయటకొచ్చి సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.

varanasi

సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి (SS Rajamouli) కలయికలో వస్తున్న మోస్ట్ అవైటెడ్ పాన్-వరల్డ్ మూవీ వారణాసి (Varanasi) . జక్కన్న, మహేష్ బాబు (Mahesh Babu) కాంబోలో తెరకెక్కుతున్న మొదటి సినిమా కావడంతో ఈ ప్రాజెక్ట్ పై ప్రపంచవ్యాప్తంగా అంచనాలు ఏ రేంజ్‌లో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటికే రిలీజైన పోస్టర్లు, గ్లింప్స్ సోషల్ మీడియాను ఊపేయగా.. ప్రేక్షకులు, అభిమానులు ఈ సినిమా కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. 'బాహుబలి', 'ఆర్ఆర్ఆర్' వంటి గ్లోబల్ హిట్స్ తర్వాత రాజమౌళి నుంచి వస్తున్న సినిమా కావడంతో, దీనికి సంబంధించిన ఏ చిన్న వార్తైనా క్షణాల్లో వైరల్ అవుతోంది.

ఈ క్రమంలోనే 'వారణాసి' ప్రీ-రిలీజ్ బిజినెస్‌కి సంబంధించి ఒక మైండ్ బ్లాకింగ్ న్యూస్ బయటకొచ్చి సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. దాదాపు 1300 కోట్ల భారీ బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమా బిజినెస్ లెక్కలు కూడా ఆకాశాన్ని తాకేలా కనిపిస్తున్నాయి. తాజాగా ఫిలిం నగర్ వర్గాల్లో చక్కర్లు కొడుతున్న టాక్ ప్రకారం.. ఒక్క తెలుగు రాష్ట్రాల నుంచే ఈ సినిమా థియేట్రికల్ హక్కుల కోసం ఏకంగా 320 కోట్లకు పైగా బిజినెస్ జరుగుతున్నట్టు టాక్. ఇది నిజంగా ఒక సంచలన సంఖ్య అని చెప్పాలి.

గతంలో 'ఆర్ఆర్ఆర్', 'పుష్ప 2' వంటి భారీ చిత్రాలు నెలకొల్పిన బాక్సాఫీస్, ప్రీ-రిలీజ్ రికార్డులను 'వారణాసి' సులువుగా తిరగరాసేలా ఉందనే చర్చ నడుస్తోంది. దీనిపై మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉన్నప్పటికీ.. "రాజమౌళి-మహేష్ బాబు కాంబో అంటే ఆ మాత్రం బిజినెస్ జరగాల్సిందే" అంటూ సోషల్ మీడియాలో ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, ఇతర రాష్ట్రాల్లో కూడా వారణాసి బిజినెస్ ఓ రేంజ్‌లో జరుగుతోందని అంటున్నారు. ఇక దాదాపు 120కి పైగా దేశాల్లో ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా విడుదల చేయడానికి ప్లాన్ చేస్తుండగా.. గ్లోబల్ వైడ్‌గా ఎంత భారీ టార్గెట్ ఉన్నా, కంటెంట్‌తో సినిమా ఆ టార్గెట్‌ను ఈజీగా రీచ్ అవుతుందని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు.

ఇక ఈ సినిమాకి ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి స్వరాలు అందిస్తున్నారు. ఎస్.ఎస్. కార్తికేయ, కే.ఎల్. నారాయణ సంయుక్తంగా ఈ భారీ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో మహేష్ బాబు 'రుద్ర', 'శ్రీరాముడు'గా ద్విపాత్రాభినయంలో కనిపిస్తుండటం విశేషం. మహేష్ సరసన గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా కథానాయికగా నటిస్తుండగా, మలయాళ సూపర్ స్టార్ పృథ్విరాజ్ సుకుమారన్ పవర్ ఫుల్ విలన్ పాత్రలో నటిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ చివరి దశకు చేరుకుందని, మరో 80 రోజుల టాకీ పార్ట్ మాత్రమే బ్యాలెన్స్ ఉందని తెలుస్తోంది. వచ్చే ఏడాది ఏప్రిల్‌లో ప్రేక్షకుల ముందుకు రానున్న 'వారణాసి' బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభంజనం సృష్టిస్తుందో చూడాలి.

Updated Date - Sep 06 , 2026 | 11:39 PM