Haindava: ఎవరైనా.. ఏం వాయిస్ రా బాబు.. పోవడం లేదు మైండ్ లో నుంచి

ABN , Publish Date - Nov 12 , 2026 | 08:16 PM

కుర్ర హీరోబెల్లంకొండ సాయి శ్రీనివాస్ (Bellamkonda Sai Sreenivas) ఎప్పటి నుంచో ఒక మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్న విషయం తెల్సిందే. ప్రస్తుతం ఈ హీరో నటిస్తోన్న చిత్రాల్లో హైందవ (Haindava) ఒకటి.

Haindava

కుర్ర హీరోబెల్లంకొండ సాయి శ్రీనివాస్ (Bellamkonda Sai Sreenivas) ఎప్పటి నుంచో ఒక మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్న విషయం తెల్సిందే. ప్రస్తుతం ఈ హీరో నటిస్తోన్న చిత్రాల్లో హైందవ (Haindava) ఒకటి. లుధీర్ బైరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని మూన్ షైన్ పిక్చర్స్ బ్యానర్ పై మహేష్ చందు నిర్మిస్తున్నాడు. ఈ సినిమాలో బెల్లంకొండ శ్రీనివాస్ సరసన సంయుక్త మీనన్ నటిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. తాజాగా హైందవ నుంచి అందమైన మెలోడీ సాంగ్ లిరికల్ వీడియోను మేకర్స్ రిలీజ్ చేశారు.


ఎవరైనా ఎవరైనా నాలాగా నిన్ను చూసారా...అంటూ సాగిన ఈ సాంగ్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. ప్రముఖ సంగీత దర్శకుడు సామ్ సి.ఎస్ ఈ పాటకు అద్భుతమైన మ్యూజిక్ అందించగా, కిట్టు విస్సప్రగడ లిరిక్స్ అందించాడు. లిరిక్స్ అన్ని ఒక ఎత్తు అయితే సింగర్ శ్వేత మోహన్ తన వాయిస్ తో సాంగ్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లింది. హీరోయిన్ .. హీరో ఒకరిపై ఒకరికి ఉన్న అనురాగాన్ని ఎంతో అందంగా ఈ పాటలో చూపించారు. లిరిక్స్ కూడా ఎంతో అర్థవంతంగా ఉండి, శ్రోతలను లీనం చేసేలా ఉన్నాయి. బీచ్ ఒడ్డున సంయుక్త అందాలు మరింత ఆకట్టుకున్నాయి. అసలు శ్వేతా వాయిస్ లో లవ్ సాంగ్స్ వింటుంటే ఎంతో ఆహ్లాదంగా ఉందని, ఈ సాంగ్ మైండ్ లో నుంచి పోవడం లేదని, శ్వేతా లిస్ట్ లో మరో రొమాంటిక్ సాంగ్ యాడ్ అయ్యిందని నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు.


ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే రిలీజ్ కాబోతుంది. ఈ చిత్రంలో శ్రీనివాస్ పవర్ ఫుల్ పోలీసాఫీసర్ గా కనిపించనున్నాడు. హైందవపై ఇండస్ట్రీలో చాలా అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సినిమా కాకుండా టైసన్ నాయుడు సినిమాని కూడా రిలీజ్ చేయడానికి సిద్ధమవుతున్నాడు ఈ కుర్ర హీరో. ఎప్పుడో రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం కొన్ని కారణాల వలన ఆగుతూ వస్తోంది. ఈమధ్యే ఈ చిత్రం నుంచి రిలీజైన సాంగ్ మంచి హిట్ అయ్యింది. మరి ఈ సినిమాలతో బెల్లంకొండ హీరో ఎలాంటి విజయాలను అందుకుంటాడో చూడాలి.

Updated Date - Nov 12 , 2026 | 08:42 PM