Megna Mukharjee: ఆర్జీవీ సత్య.. ఫీమేల్ వర్షన్! జేడీ చక్రవర్తి కామెంట్స్ వైరల్
ABN , Publish Date - Feb 05 , 2026 | 08:14 AM
టాలీవుడ్‌కు మరో కొత్త అందం పరిచయం అవుతోంది. మిస్ ఇండియా ఫైనలిస్ట్‌గా గుర్తింపు పొందిన మేఘనా ముఖర్జీ టాలీవుడ్‌లో డెబ్యూ చేస్తోంది.
టాలీవుడ్‌కు మరో కొత్త అందం పరిచయం అవుతోంది. ఇప్పటికే కమెడియన్ సత్య హీరోగా వస్తున్న జెట్‌లీ సినిమాతో మిస్ యూనివర్స్ ఇండియా రెహా సింగా టాలీవుడ్‌లో అడుగు పెడుతుండగా ఇప్పుడు అదే బాటలో మరో బ్యూటీ మిస్ ఇండియా ఫైనలిస్ట్‌గా గుర్తింపు పొందిన మేఘనా ముఖర్జీ (Megna Mukharjee) డెబ్యూ చేస్తోంది. టీవీ నటుడు ప్రభాకర్ కుమారుడు, యాటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ (Chandra Hass) హీరోగా నటిస్తున్న ‘బరాబర్ ప్రేమిస్తా’ (Barabar Premistha )సినిమాలో ఆమె కథానాయికగా చేస్తోంది. ఫిబ్రవరి 6న ఈ మూవీ విడుదలకు సిద్ధమైంది.
అయితే.. చాలామందికి మేఘనా ముఖర్జీ అంటే గుర్తుకొచ్చేది టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీతో చేసిన వైరల్ యాడ్‌లోని ‘మోనా డార్లింగ్’ పాత్ర. ఆ ప్రకటనతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఆమె, తర్వాత ఫ్యాషన్ మరియు అడ్వర్టైజింగ్ రంగాల్లో దూసుకుపోయింది. టైటాన్, లోరియల్ వంటి ప్రముఖ బ్రాండ్స్‌తో బిజీగా మారింది. ఇప్పుడు తెలుగు సినిమాతో హీరోయిన్‌గా ఆరంగేట్రం చేస్తుంది.
ఇదిలాఉంటే.. ‘బరాబర్ ప్రేమిస్తా’ ద్వారా తెలుగులో అడుగుపెడుతున్న మేఘనా పాత్ర కథలో కీలకమని చిత్రబృందం చెబుతోంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి పాటలు మంచి ఆదరణ దక్కించుకోగా ఓ పాటలో ఈ అమ్మడు హీరోతో ముద్దలతోనూ రెచ్చిపోయి నటించి యూత్ ఆడియన్స్‌ను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. చూడాలి మరి హీరోయిన్‌గా మేఘన టాలీవుడ్‌లో ఆమె ప్రయాణం ఎలా సాగుతుందో.
అయితే.. ఇటీవల జరిగిన ఈ సినిమా ఈవెంట్‌లో హీరో పాడిన పాట కాంట్రవర్సీకి దారి తీసిన సంగతి తెలిసందే. కాగా అతిథిగా వచ్చిన జేడీ చక్రవర్తి (J. D. Chakravarthy) ఈ ముద్దుగుమ్మ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మేఘన ఇంకా ఆర్జీవీ దృష్టిలో పడలేదని పడితే వెంటనే మేఘనను పెట్టి సత్య ఫీమేల్ వర్షన్ తీసేవాడని కితాబిచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.