Chiranjeevi: మెగాస్టార్‌ కెరీర్‌లో ఇదొక గొప్ప రికార్డు..

ABN , Publish Date - Jan 19 , 2026 | 04:44 PM

సంక్రాంతి బరిలో వచ్చి బ్లాక్‌బస్టర్‌ విజయం అందుకున్నారు చిరంజీవి, అనిల్‌ రావిపూడి. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘మన శంకర వరప్రసాద్‌గారు’ చిత్రం కొత్త రికార్డులు సృష్టిస్తోంది.



సంక్రాంతి బరిలో వచ్చి బ్లాక్‌బస్టర్‌ విజయం అందుకున్నారు చిరంజీవి(Chiranjeevi), అనిల్‌ రావిపూడి (Anil Ravipudi). వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘మన శంకర వరప్రసాద్‌గారు’ చిత్రం కొత్త రికార్డులు సృష్టిస్తోంది. విడుదలకు ముందు, పాటలు, ట్రైలర్స్‌తో అత్యధిక వ్యూస్‌ రాబట్టి రికార్డులు (Mana Shankara Varaprasad Garu) సృష్టించిన ఈ చిత్రం ఇప్పుడు మరికొన్ని రికార్డులను తన ఖాతాలో వేసుకుంది. ప్రీమియర్స్‌ నుంచే సినిమా టికెట్స్‌కు మంచి క్రేజ్‌ ఏర్పడింది. విపరీతంగా టికెట్లు సేల్‌ అయ్యాయి. సినిమా విడుదలయ్యాక ఫస్ట్‌ వీక్‌ రూ.292 కోట్లు వసూలు చేసినట్లు ఇప్పటికే నిర్మాతలు ప్రకటించారు. వారంలో ఈ స్థాయిలో వసూళ్లు రాబట్టిన మొదటి ప్రాంతీయ చిత్రంగా ఈ సినిమా నిలిచిందని మేకర్స్‌ తెలిపారు. దీంతో వసూళ్ల పరంగా కూడా కొత్త రికార్డులు నమోదు అవుతున్నాయి. సినిమా విడుదలైన ఏడో రోజున కూడా  రూ.31 కోట్లు రాబట్టిందీ సినిమా. తెలుగు   రాష్ట్రాల్లో వారం తర్వాత ఇంత వసూళ్లు సాధించిన తొలి తెలుగు సినిమాగా చెబుతున్నారు. (Mana Shankara Varaprasad Garu records)

అంతే కాదు విదేశాల్లోనూ ఈ సినిమాకు మంచి స్పందన వస్తోంది. ఉత్తర అమెరికాలో ఇప్పటివరకూ 2.96 మిలియన్‌ల డాలర్లు వసూలు చేసింది. 3 మిలియన్ల డాలర్ల దిశగా దూసుకెళ్తుంది. మెగాస్టార్‌ కెరీర్‌లో 3 మిలియన్ల డాలర్లు సాధించిన సినిమాగా కూడా ఈ చిత్రం రికార్డు సాధించింది. దర్శకుడిగా అనిల్‌ రావిపూడి కూడా ఓ ఘనత సాధించారు. గతేడాది ఆయన దర్శకత్వంలో ‘సంక్రాంతికి వస్తున్నాం’ పెద్ద హిట్‌ అయింది. ఈ ఏడాది సంక్రాంతికి ‘మన శంకర వరప్రసాద్‌ గారు’తో విన్నర్‌గా నిలిచారు. ఈ రెండు చిత్రాలు కూడా రెండు వందల కోట్లకు పైగా వసూళ్లు సాధించిన చిత్రాల జాబితాలో ఉన్నాయి. రెండేళ్లల్లో రూ.200 కోట్ల సినిమాలు తెరకెక్కించిన దర్శకుడిగా అనిల్‌ గుర్తింపు పొందారు. సుస్మిత కొణిదెల, సాహు గారపాటి ఈ చిత్రాన్ని నిర్మించారు. నయన తార కథానాయికగా నటించారు.

Updated Date - Jan 19 , 2026 | 04:52 PM