కాకా.. నీ స్పీడు కేక
ABN , Publish Date - Sep 25 , 2026 | 02:59 PM
మన శంకరవరప్రసాద్ గారు ఇచ్చిన హిట్ తో మెగాస్టార్ చిరంజీవి జోరు పెంచారు. కుర్ర హీరోలకు పోటీగా వరుస సినిమాలను పట్టాలెక్కించి ఇండస్ట్రీని షేక్ చేస్తున్నారు.
మన శంకరవరప్రసాద్ గారు ఇచ్చిన హిట్ తో మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) జోరు పెంచారు. కుర్ర హీరోలకు పోటీగా వరుస సినిమాలను పట్టాలెక్కించి ఇండస్ట్రీని షేక్ చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన హీరోగా డైరెక్టర్ కొల్లి బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ మాస్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘కాకా’ (Kaka). వాల్తేరు వీరయ్య తర్వాత వీరిద్దరి కాంబోలో వస్తోన్న చిత్రం కావడంతో సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకాయి. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టైటిల్ టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
ఎలాగైనా కాకాను సంక్రాంతి బరిలోకి దింపాలని మేకర్స్ గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే ఈ సినిమా షూటింగ్, మిగతా పనులు ప్రస్తుతం జెట్ స్పీడ్‌లో దూసుకెళ్తున్నాయి. మెగా అభిమానులకు, సినీ ప్రియులకు అనుకున్న సమయానికే సినిమాను అందించేందుకు మేకర్స్ పక్కా ప్రణాళికతో ముందడుగు వేస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన డబ్బింగ్ పనులను అధికారికంగా ప్రారంభించినట్లు మేకర్స్ ఖరారు చేశారు. డబ్బింగ్ పనుల ప్రారంభోత్సవానికి సంబంధించిన పూజా కార్యక్రమాల వీడియోను సోషల్ మీడియా ద్వారా విడుదల చేయడంతో మెగా ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. దీన్ని బట్టి కాకా చిత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ అనుకున్న టైమ్‌కే థియేటర్లలోకి రావడం గ్యారెంటీ అని స్పష్టమవుతోంది.
ఈ భారీ చిత్రంలో యంగ్ అండ్ టాలెంటెడ్ నటి అనస్వర రాజన్ ఒక కీలక పాత్రలో నటిస్తుండగా, మ్యూజిక్ సెన్సేషన్ తమన్ ఆకట్టుకునే స్వరాలను అందిస్తున్నాడు. ప్రముఖ నిర్మాణ సంస్థ కె వి ఎన్ ప్రొడక్షన్స్ తెలుగు చలనచిత్ర పరిశ్రమలోకి అడుగుపెడుతూ గ్రాండ్‌గా నిర్మిస్తున్న మొదటి చిత్రమిది. ఈ మాస్ యాక్షన్ డ్రామాను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 13న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. మరి ఈ సినిమాతో చిరు - బాబీ ఎలాంటి విజయాన్ని అందుకుంటారో చూడాలి.