Chiranjeevi: మహేష్.. బాగా ముదిరిపోయాక నా దగ్గరికి రా

ABN , Publish Date - Nov 17 , 2026 | 09:55 PM

కుర్ర హీరో అనీష్, అనస్వర రాజన్ జంటగా మహేష్ ఉప్పాల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఇట్లు అర్జున (Itlu Arjuna). అక్కినేని నాగార్జున సమర్పించిన ఈ సినిమా నవంబర్ 13 న రిలీజ్ అయ్యి మంచి విజయాన్ని అందుకుంది.

Chiranjeevi

కుర్ర హీరో అనీష్, అనస్వర రాజన్ జంటగా మహేష్ ఉప్పాల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఇట్లు అర్జున (Itlu Arjuna). అక్కినేని నాగార్జున సమర్పించిన ఈ సినిమా నవంబర్ 13 న రిలీజ్ అయ్యి మంచి విజయాన్ని అందుకుంది. మూగవాని పాత్రలో అనీష్ చాలా చక్కగా నటించాడు. ఇక తాజాగా ఈ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ లో మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) కూడా భాగమయ్యారు. టాలీవుడ్‌లో చిన్న సినిమాలను చిరు ఎప్పుడు ప్రోత్సహిస్తూనే వస్తున్నారు. ఈ సక్సెస్ మీట్ లో చిరు - నాగ్ కలయిక మ్యూచువల్ ఫ్యాన్స్ కి కన్నుల పండగగా నిలిచింది.


ఇక ఈ వేడుకలో చిరంజీవి మాట్లాడుతూ.. 'అందరికీ నమస్కారం. కింగ్ నాగార్జున గారు చెప్పినట్లుగా చాలా వైబ్రెంట్ గా, చాలా ఉత్సాహంగా ఇక్కడ వాతావరణం చూస్తుంటే మేము కూడా మీలాగా ఒక 20 ఇయర్స్ యంగ్ అయిపోయిన ఫీలింగ్ వచ్చింది. నిజమైన సక్సెస్ ఏమిటి అనేది మీ వైబ్రేషన్స్‌లో, మీ ఉత్సాహంలో తెలుస్తుంది. ఈ సినిమా హీరో అనీష్.. చాలా అదృష్టవంతుడు. ఏ హీరోకి కూడా డెబ్యూ ఫిల్మ్‌కి, ఒక కొత్త హీరోకి ఇండస్ట్రీలో ఉన్నటువంటి హీరోలందరూ ఏదో ఒక విధంగా సపోర్ట్ చేయడం అన్నది ఎవరికీ దక్కలేదు. అది ఒక్క అనీష్‌కే దక్కింది, మాకెవరికీ దక్కలేదు. నాగార్జున గారికి కూడా దక్కుతుందని అనుకోలేదు. ఒక పక్కనుంచి నాని ఒక సాంగ్ రిలీజ్ చేశాడు, మరో పక్క ట్రైలర్ తారక్ రిలీజ్ చేశాడు. ఈ సినిమాకి సాక్షాత్ కింగ్ నాగ్ వెన్నుముకలాగా నిలిచాడు. రామ్ చరణ్ ప్రమోషన్‌కి, ఈవెంట్‌కి వచ్చాడు. వెంకటేష్.. ప్రతి ఒక్కరూ అనీష్‌ను ఇంతగా పొగుడుతూ ప్రైజ్ చేస్తున్నారు అంటే రీజన్ ఏంటంటే.. మా అందరి మిత్రుడు, దైవభక్తుడు మహేష్ రెడ్డి గారు. బాబా మీద ఉన్న భక్తి ప్రవృత్తులు, సినిమా పట్ల ఉన్న మక్కువతో.. నాగార్జున గారితో రామదాసు, షిర్డీ సాయి సినిమాలు చూస్తూ పెరిగిన అనీష్‌కు సినిమాలపై ఇంట్రెస్ట్ రావడంతో అందరూ అతన్ని ఎంకరేజ్ చేశారు . ఆడియన్స్‌కు కూడా కంటెంట్ నచ్చి ఈ సినిమాను ఇంత పెద్ద విజయం అందించారు. హాట్స్ ఆఫ్ అండ్ హార్టీ కన్గ్రాచులేషన్స్ టూ ఇట్లు అర్జున హోల్ యూనిట్


గత ఐదారు ఏళ్లుగా చూస్తే.. పెద్ద పెద్ద సినిమాలే తప్ప చిన్న సినిమాలకు ఆదరణ తగ్గిపోయింది, ఓటీటీలో చూద్దాంలే అనుకునేవారు ఎక్కువయ్యారు. కానీ, ఈ సంవత్సరంలో చిన్న సినిమాలు, కొత్తదనం ఉన్న సినిమాలు ప్రతిదీ ఆదరణ నోచుకుంటున్నాయి. పరిశ్రమ కొత్తవారితో కళకళలాడుతుందంటే ప్రధాన కారణం యంగ్ టాలెంట్, రైటర్స్, డైరెక్టర్స్. వీళ్లే సినిమా పరిశ్రమకు కొత్త ఊపును ఇస్తున్నారు. సీనియర్లు గౌరవం తీసుకురావచ్చు కానీ, థియేటర్స్‌కి ఆడియన్స్‌ని రప్పించేలా చేస్తున్నారంటే అది ఓన్లీ యంగ్ టాలెంటే. ఈ సినిమా వెనక ఉన్న యంగ్ టీమ్‌కి, డైరెక్టర్ మహేష్‌కు, నిర్మాత వెంకీ కుడుములకు, అనీష్‌కు, హీరోయిన్ అనస్వర రాజన్‌కు అభినందనలు తెలుపుతున్నాను.


ఇక ఈ సినిమా నేను ఈమధ్యే చూశాను. అనీష్ .. మాట్లాడకుండా తన హావభావాలతో, బాడీ లాంగ్వేజ్‌తో ఫస్ట్ నుంచి చివరి వరకు ఎంత బాగా అట్రాక్ట్ చేసుకున్నాడంటే.. ఒక కొత్త యాక్టర్‌కి డైలాగ్స్ లేకుండా అటెన్షన్ డ్రా చేయడం చాలా కష్టం. గీతాంజలిలో నాగ్, ముత్యమంత ముద్దులో కమలహాసన్, రంగస్థలంలో చరణ్ చిట్టిబాబుగా, అఖిల్ లెనిన్‌లో, మొన్నటికి మొన్న సూర్య బ్లైండ్ బాయ్‌గా చేసినట్లుగా.. హీరో పాత్రలో ఏదైనా లోపం ఉండి, ఆ ఛాలెంజింగ్ రోల్‌ని ఫస్ట్ సినిమాలోనే చేసి ప్రూవ్ చేసుకోవడం అన్నది అనీష్‌కే దక్కిన అదృష్టం. రాధిక, మహేష్‌.. బిడ్డల సక్సెస్ చూస్తున్న ఈ పుత్రోత్సాహాన్ని మీరు నిండుగా మెండుగా పొందుతున్నారు.


అనస్వర రాజన్.. గత ఏడు ఎనిమిది నెలలుగా నీతో ట్రావెల్ చేస్తున్నాను. ఆమె చాలా అద్బుతమైన నటి. ముఖ్యంగా ఆమె స్మైల్ ఇన్నోసెన్స్‌ని, ప్యూరిటీని చూపుతుంది. ఈ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ నీకు బ్రైట్ ఫ్యూచర్ ఇస్తుంది, వెల్కమ్. ఇక కాకా గురించి.. లీక్ చేస్తానని నాకు భయంగా ఉంది. డైరెక్టర్ మహేష్ గురించి చెప్పాలి. కమర్షియల్ క్రైమ్ సినిమాలో లవ్ ఇరికించాడా, లవ్‌లో క్రైమ్ జొప్పించాడా అనేంత బాగా రెండు మింగిల్ అయినవి. ఎక్స్‌ట్రార్డినరీ స్క్రీన్ ప్లే. నాతో సినిమా చేయమని అడగను, నువ్వు యంగ్ స్టర్స్‌తోనే సినిమా చేయి.. నువ్వు బాగా ముదిరిపోయిన తర్వాత నా దగ్గరకు రా బోలెడన్ని ఐడియాలు ఇస్తాను ఇక ఈ సినిమాలో మరొక హీరో ఉన్నాడు.. తను వినిపిస్తాడు.. కనిపించడు, తనే మా ఓజీ తమన్. తమన్ ఎక్కడికి వెళ్లినా సరే కాకా.. కాకా అంటున్నాడు. నీకు చిన్న ప్రమాదం ఉంది, అన్ని సినిమాల గురించి మాట్లాడు లేదంటే మాట్లాడడం మానేయి, ఎందుకంటే మిగతావాళ్ళు మా సినిమా గురించి చెప్పట్లేదు కాకానే కేకనా అంటున్నారు. ఏదేమైనా తమన్ ఈ సినిమాకి ఆరో ప్రాణంగా నిలిచాడు, సాంగ్స్ అన్నీ చాలా బాగున్నాయి.


నిర్మాత వెంకీ కుడుముల.. నీలో చాలా కామెడీ సెన్స్ ఉంది. నేను ఎప్పుడూ ఏ డైరెక్టర్‌ని నాతో సినిమా చేస్తావా అని అడగలేదు, దుర్మార్గుడిని అడిగాను.. నీకు అసలు నా దగ్గరకు వచ్చే అర్హత లేదు, నువ్వు ఇంటికి వస్తావేమో మా ఇంటి గేట్లు తెరిచి.. మంచి కథతో వస్తానంటే ఆశగా ఎదురుచూసేవాడిని, నువ్వు నాతో సినిమా చేయకుండా ప్రొడ్యూసర్ అవతారం ఎత్తావు. ఫస్ట్ టైమ్ నిర్మాతగా డెబ్యూ ఇస్తూ కొత్త డైరెక్టర్స్‌ని వెల్కమ్ చేయడం అభినందనీయం.ఈ సినిమాలో పనిచేసిన సాంకేతిక నిపుణులకు, నటీనటులకు అందరికీ నా హృదయపూర్వక అభినందనలు' అంటూ ముగించారు.

Updated Date - Nov 17 , 2026 | 10:16 PM