చిరంజీవి: భుజానికి కీ-హోల్‌ సర్జరీ జరిగింది.. చిరు ట్వీట్

ABN , Publish Date - Feb 16 , 2026 | 08:14 PM

ఇటీవల  మెగాస్టార్  చిరంజీవి (Chiranjeevi) భుజానికి చిన్న ఆపరేషన్  జరిగింది. ఎక్స్‌ వేదికగా ఆయన ఈ విషయాన్ని షేర్ చేశారు.

ఇటీవల మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) భుజానికి చిన్న ఆపరేషన్ జరిగింది. ఎక్స్‌ వేదికగా ఆయన ఈ విషయాన్ని షేర్ చేశారు. 'నా చేతికి కట్టు ఉండటం చూసి చాలా మంది శ్రేయోభిలాషులు నా ఆరోగ్యం గురించి ఆరా తీశారు. నా భుజానికి చిన్న కీ-హోల్‌ సర్జరీ జరిగింది. ప్రస్తుతం నేను కోలుకుంటున్నా. నా రోజువారీ పనులు సాఫీగా సాగుతున్నాయి. ఆర్థోస్కోపీ సర్జన్‌ డాక్టర్‌ నితిన్‌కు హృదయపూర్వక కృతజ్ఞతలు. సర్జరీ విషయంలో తీసుకున్న జాగ్రత్తలతో సర్జరీ ప్రక్రియ   సౌకర్యవంతంగా జరిగింది. నా పట్ల మీరు చూపిస్తున్న ప్రేమ, అభిమానం, అందిస్తున్న దీవెనలకు మనసు ఎంతో సంతోషంగా ఉంది’ అని ట్వీట్ లో పేర్కొన్నారు.  


అల్లు శిరీష్‌ వివాహం సందర్భంగా అల్లు అరవింద్‌ దంపతులు  ఆహ్వాన పత్రిక ఇవ్వడానికి వెళ్లిన సందర్భంలో తీసిన ఫొటోల్లో   చిరంజీవి చేతికి కట్టు కనిపించింది. అప్పటి నుంచి అభిమానులు బాస్ చేతికి ఏమైంది అంటూ ఆందోళన చెందారు. ఈ క్రమంలో చిరంజీవి సోషల్ మీడియా వేదిక ఈ విషయాన్ని తెలిపారు.   

Updated Date - Feb 16 , 2026 | 08:27 PM