ఎవర్రా ఈ అందగాడు.. మెగాస్టార్ అంటారులే
ABN , Publish Date - Aug 18 , 2026 | 08:15 PM
సాధారణంగా ఎవరికైనా వయస్సు పెరుగుతూ వస్తుంది. కానీ మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) కి మాత్రం వయస్సు తగ్గుతూ వస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
సాధారణంగా ఎవరికైనా వయస్సు పెరుగుతూ వస్తుంది. కానీ మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) కి మాత్రం వయస్సు తగ్గుతూ వస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. 71 ఏళ్ల వయస్సులో కూడా ఆయన గ్లామర్, ఛార్మ్ చూస్తుంటే ప్రతీ ఒక్కరితో పాటు ఇండస్ట్రీ మొత్తం ఆశ్చర్యపోతోంది. సాధారణ యువకుడిగా కొణిదెల శివ శంకరవరప్రసాద్ గా తన నట ప్రస్థానాన్ని మొదలుపెట్టి, స్వయంకృషితో టాలీవుడ్ తిరుగులేని మెగాస్టార్ గా మారడం మామూలు విషయం కాదు. ఇప్పటివరకు ఎన్నో ఇండస్ట్రీ హిట్ చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు అందించిన చిరు, ఈ వయస్సులో కూడా కుర్ర హీరోలకు పోటీగా వరుస సినిమాలు చేస్తూ ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఈ నెల ఆయన పుట్టినరోజు కావడంతో, అభిమానుల కోసం చేసిన స్పెషల్ ఫొటోషూట్ పిక్స్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.
నల్లటి టీ-షర్ట్, క్లాసిక్ జీన్స్, బ్లాక్ సన్ గ్లాసెస్ ధరించి ఎంతో స్టైలిష్‌గా కనిపిస్తున్న ఈ లేటెస్ట్ ఫొటోలు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి. ఈ ఫొటోల్లో ఆయన బాడీ లాంగ్వేజ్, ఆటిట్యూడ్ చూసిన అభిమానులు ఏజ్ ఈజ్ జస్ట్ ఏ నంబర్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. 71 వయసు వచ్చినా చిరంజీవిలోని అదే ఫిట్‌నెస్, ఫేస్‌లో అదే గ్లో, ఛార్మ్ ఏమాత్రం తగ్గలేదని నెటిజన్లు కొనియాడుతున్నారు. అంతేనా రామ్ చరణ్ కి అన్నయ్యలా ఉన్నాడు అని కొందరు.. ఎవర్రా ఈ అందగాడు.. భలే ఉన్నాడు అని మరి కొందరు అంటుంటే.. వారికి సమాధానంగా హా.. మెగాస్టార్ అంటారులే అని సరదాగా చెప్పుకొస్తున్నారు.
ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి భారీ బడ్జెట్ సోషియో-ఫాంటసీ చిత్రం విశ్వంభర తో పాటు మరికొన్ని క్రేజీ ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్నారు. ఈ వయసులోనూ ఆయన చూపిస్తున్న డెడికేషన్, క్రమశిక్షణ, గ్లామర్ రాబోయే తరాలకు పెద్ద స్ఫూర్తిగా నిలుస్తోంది. రాబోయే పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన ఈ స్పెషల్ ఫోటోసే ఈ రేంజ్ లో ఉంటే.. బర్త్ డే రోజున మేకర్స్ అభిమానులకు ఎలాంటి సర్ప్రైజ్ ఇస్తారో చూడాలి.