Chiranjeevi: మెగాస్టార్ కి సర్జరీ.. అసలేమైంది

ABN , Publish Date - Jan 05 , 2026 | 03:53 PM

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) కి సర్జరీ జరిగినట్లు తెలుస్తోంది. గత కొన్ని రోజులుగా ఆయన మోకాలి నొప్పితో బాధపడుతున్నారట..

Chiranjeevi

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) కి సర్జరీ జరిగినట్లు తెలుస్తోంది. గత కొన్ని రోజులుగా ఆయన మోకాలి నొప్పితో బాధపడుతున్నారట.. సర్జరీ కోసం విదేశాలకు వెళ్లాలని వైద్యులు తెలిపినా.. మన శంకర వరప్రసాద్ గారు (Mana Shankara Varaprasad Garu) సినిమా షూటింగ్ మిగిలి ఉండడంతో దాన్ని ఫినిష్ చేయడానికి కొంత సమయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మోకాలి నొప్పితోనే ఈ సినిమాలో చిరు డ్యాన్స్ చేసినట్లు సమాచారం. ఇక సినిమా షూటింగ్ అయ్యాక ఇప్పుడు స‌ర్జ‌రీ చేయించుకొన్న‌ట్టు ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది.

అందుతున్న సమాచారం ప్రకారం చిరు స‌ర్జ‌రీ విజ‌య‌వంతంగా పూర్త‌యింద‌ని తెలుస్తోంది. దీంతో మెగా అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. చిరు త్వరగా కోలుకొని ఇండియా తిరిగి రావాలని దేవుడికి ప్రార్ధనలు చేస్తున్నారు. ఇక మ‌న శంక‌ర వ‌ర ప్ర‌సాద్ గారు సినిమా రిలీజ్ కు ఇంకా రెండు వారాలు కూడా లేదు. దీంతో మేకర్స్ ప్రమోషన్స్ వేగాన్ని పెంచేశారు. ఈవారంలోనే ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక జ‌ర‌గ‌బోతున్న విషయం విదితమే. ఆ ఈవెంట్ లోపు చిరు ఇండియాకు చేరుకుంటాడని తెలుస్తోంది. కేవలం ఈవెంట్స్ మాత్రమే కాకుండా అనిల్ తో కలిసి అన్ని ప్రమోషన్స్ కి చిరు అటెండ్ కానున్నాడు.

ఇక మోకాలి సర్జరీ చిన్నది అయినా కూడా మెగా ఫ్యామిలీ ఈ విషయాన్నీ చాలా సీక్రెట్ గా ఉంచడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే అంత సీక్రెట్ అందులో ఏముంది.. ?. నిజంగానే చిరు ఆరోగ్యానికి ఏమైనా సమస్యనా అని అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరి ఇందులో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది.

Updated Date - Jan 05 , 2026 | 03:53 PM