Srikanth: చిరంజీవి అలా అనడం రెట్టింపు ఉత్సాహాన్ని ఇచ్చింది

ABN , Publish Date - Jul 29 , 2026 | 06:41 PM

'ఈ సిరీస్ చూసి చిరంజీవి గారు వకీల్ సాబ్, కెరీర్ బిగినింగ్ లో ఆయన నటించిన న్యాయం కావాలి సినిమాలు గుర్తొచ్చాయని చెప్పడం మరింత ఆనందం కలిగించింది' అని శ్రీకాంత్ అన్నారు.

'ఈ సిరీస్ చూసి చిరంజీవి గారు 'వకీల్ సాబ్', కెరీర్ బిగినింగ్ లో ఆయన నటించిన 'న్యాయం కావాలి' సినిమాలు గుర్తొచ్చాయని చెప్పడం మరింత ఆనందం కలిగించింది' అని శ్రీకాంత్ అన్నారు. ఆయన కీలక పాత్రలో  జీ5 నుంచి ప్రేక్షకుల ముందుకు రాబోతున్న కొత్త తెలుగు ఒరిజినల్ వెబ్ సిరీస్ ‘అబ్జెక్షన్ మై లార్డ్’. కోర్ట్‌రూమ్ నేపథ్యంలో ఎమోషనల్ డ్రామాగా రూపొందిన ఈ సిరీస్‌లో  అనన్య శర్మ, ముఖేష్ రిషి, స్నేహాల్, సమీర్ ఇతర కీలక పాత్రల్లో నటించారు. ‘నోటరీ పరశురాం’ అనే ట్యాగ్‌లైన్‌తో తెరకెక్కిన ఈ సిరీస్‌కు సంతోష్ అయ్యప్పన్ దర్శకత్వం వహించగా, డ్రీమ్ హౌస్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాజ్‌కుమార్ ఆకెళ్ల నిర్మించారు. మొత్తం ఏడు ఎపిసోడ్లుగా రూపొందిన ఈ సిరీస్ జూలై 31 నుంచి జీ5లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రివ్యూ ఈవెంట్‌లో చిత్రబృందం పాల్గొని తమ అనుభవాలను పంచుకుంది.

దర్శకుడు సంతోష్ అయ్యప్పన్ మాట్లాడుతూ, కేవలం 19 రోజుల్లోనే ఈ సిరీస్ షూటింగ్ పూర్తి చేయడం టీమ్ కృషి వల్లే సాధ్యమైంది. . నిర్మాత రాజ్‌కుమార్, టెక్నీషియన్లు, నటీనటుల సహకారం లేకుండా ఇది సాధ్యమయ్యేది కాదు' అని చెప్పారు. 

ముఖేష్ రిషి మాట్లాడుతూ' తెలుగు ప్రేక్షకులు నాపై ఎప్పుడూ ప్రత్యేకమైన ఆదరణ చూపిస్తారు. ఈ సిరీస్ కోసం శ్రీకాంత్ రోజుకు దాదాపు 18 గంటల పాటు ఎంతో కష్టపడి పనిచేశారు. జూలై 31 నుంచి కుటుంబ సభ్యులతో కలిసి ఈ సిరీస్‌ను చూడండి' అని కోరారు. 

హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ 'ఈ సిరీస్ చూసి చిరంజీవి గారు వకీల్ సాబ్, కెరీర్ బిగినింగ్ లో ఆయన నటించిన న్యాయం కావాలి. సినిమాలు గుర్తొచ్చాయని చెప్పడం మరింత ఆనందం కలిగించింది. జీ5తో నాకు ఫ్రటీకేఆ అనుబంధం ఉంది. ఇప్పటికి దీనికోసం మూడు వెబ్ సిరీస్‌లు చేశాను. ప్రతి సిరీస్‌లో విభిన్నమైన పాత్రలు పోషించే అవకాశం రావడం ఆనందంగా ఉంది.  సినిమా కంటే వెబ్ సిరీస్‌లో పని చేయడం మరింత కష్టమైనా, మంచి కథల కోసం ఆ కష్టం కూడా ఆనందంగానే అనిపిస్తుంది. దర్శకుడు సంతోష్ అయ్యప్పన్ కథను ఎంతో స్పష్టతతో తెరకెక్కించారు. నిర్మాత రాజ్‌కుమార్ షూటింగ్ మొత్తం ఎంతో సహకరించారు. సిరీస్ ఫైనల్ అవుట్‌పుట్ చూసిన తర్వాత టీమ్ అంతా చాలా సంతోషించింది. ప్రతి నటుడు తమ  పాత్రను అద్భుతంగా పోషించారు. ముఖ్యంగా ముఖేష్ రిషి మంచి నటుడే కాదు, గొప్ప మనసున్న వ్యక్తి అని అన్నారు.    

Updated Date - Jul 29 , 2026 | 07:23 PM