చిరంజీవి స్పీడు.. బాబీ ప్లాన్.. అంతా సెట్..
ABN , Publish Date - Feb 08 , 2026 | 10:28 AM
‘మన శంకరవర ప్రసాద్‌గారు’ చిత్రంతో ఈ సంక్రాంతికి భారీ విజయం అందుకున్నారు మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi). సక్సెస్‌ను ఆస్వాదిస్తున్న ఆయన విరామం తీసుకోకుండా తదుపరి సినిమా చిత్రీకరణపై దృష్టిపెట్టారు.
‘మన శంకరవర ప్రసాద్‌గారు’ చిత్రంతో ఈ సంక్రాంతికి భారీ విజయం అందుకున్నారు మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi). సక్సెస్‌ను ఆస్వాదిస్తున్న ఆయన విరామం తీసుకోకుండా తదుపరి సినిమా చిత్రీకరణపై దృష్టిపెట్టారు. బాబీ కొల్లి(bobby Kolli), చిరంజీవి కాంబినేషన్‌లో ఓ సినిమా (మెగా 158) తెరకెక్కనున్న సంగతి తెలిసిందే! ‘వాల్తేరు వీరయ్య’ చిత్రం తర్వాత వీరిద్దరి కాంబోలో వస్తున్న సినిమా ఇది. ‘మన శంకరవర ప్రసాద్‌గారు’ సెట్స్ మీద ఉండగానే ఈ సినిమాను ప్రకటించారు. ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి కావడంతో వీలైనంత త్వరగా సెట్స్ మీదకు తీసుకెళ్లడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం మార్చి నుంచి ఈ సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లడానికి దర్శకుడు బాబీ సర్వం సిద్ధం చేశారు. (Kvn Productions)
తండ్రి, కూతురు కథతో ఆ సినిమా రూపొందనున్నట్లు సమాచారం. చిరంజీవి కూతురి పాత్రలో కృతిశెట్టి కనిపించనుందనే వార్తలు వైరల్ అయ్యాయి. తాజాగా ఆ పాత్రకు సారా అర్జున్‌ను ఎంపిక చేశారని సమాచారం. ఇందులో ఇద్దరు కథానాయికలకు చోటుందని ఇప్పటికే దర్శకుడు ప్రకటించారు. ఓ సీనియర్ హీరోయిన్ పేరు ఈ పాత్ర కోసం ప్రచారంలో ఉంది. మరో హీరోయిన్ కోసం కసరత్తులు చేస్తున్నారు. కెవిఎన్ ప్రొడక్షన్స్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది. ఈ సినిమా తర్వాత చిరంజీవి దసరా ఫేం శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం ఓ సినిమా కమిట్ అయ్యారు. ప్రస్తుతం ఆయన నానితో 'ప్యారడైజ్' సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ చిత్రం విడుదల కాగానే చిరుతో సినిమా ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు. మేలో ఈ సినిమా మొదలయ్యే అవకాశం ఉంది.