Happy New Year: కోటి ఆశలు, ఐక్యతతో ఈ ఏడాదిని స్వాగతిద్దాం
ABN , Publish Date - Jan 01 , 2026 | 11:50 AM
‘హ్యాపీ న్యూ ఇయర్’ అంటూ యావత్ దేశం నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతోంది. కొత్త ఆశలు, ఆశయాలతో కొత్త సంవత్సరంలో అడుగు పెట్టేశాము.
‘హ్యాపీ న్యూ ఇయర్’ అంటూ యావత్ దేశం నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతోంది. కొత్త ఆశలు, ఆశయాలతో కొత్త సంవత్సరంలో అడుగు పెట్టేశాము. అభిమానులకు శుభాకాంక్షలు చెబుతూ.. సెలబ్రిటీలు పోస్ట్‌లు పెడుతున్నారు. కొత్త సినిమాల, ఫస్ట్ లుక్స్, తాజా అప్‌డేట్‌లతో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ‘నూతన సంవత్సర శుభాకాంక్షలు. కోటి ఆశలు, ఐక్యతతో ఈ ఏడాదిని స్వాగతిద్దాం. అందరం అందమైన అనుభవాలను పోగు చేసుకుందాం’ అంటూ చిరంజీవి ట్వీట్ చేశారు.
‘మరో సంవత్సరం వచ్చేసింది. గతేడాది కంటే మరిన్ని అవకాశాలను మన ముందుకు తీసుకురావడానికి సిద్ధమైంది. ఎప్పటికీ గుర్తుండేలా ఈ న్యూ ఇయర్‌ను సెలబ్రేట్ చేసుకుందాం. అనుకున్న లక్ష్యాలను చేరుకొని సంతోషంగా ఉండాలని ఆశిస్తున్నా’
- కమల్ హాసన్
‘మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2026 మీ జీవితాల్లో ఆనందాన్ని నింపాలని కోరుకుంటున్నా’
- ఎన్టీఆర్
2025 నాకు చాలా గొప్ప సంవత్సరం.. నా ఆనందంలో భాగమైన అందరికీ ధన్యవాదాలు. 2026ను మరింత ఉత్సాహంగా ప్రారంభిద్దాం’ -
-కిరణ్ అబ్బవరం