స్కూల్ కి వెళ్తున్న క్లిన్ కారా.. ఎంత ముద్దుగా ఉందో చూడండి

ABN , Publish Date - Nov 24 , 2026 | 09:59 PM

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan), ఉపాసన కొణిదెల (Upasana Konidela) తమ ముద్దుల కూతురు క్లిన్ కారా (Klin Kaara)ను స్కూల్ నుంచి తీసుకెళ్తూ కెమెరాలకు చిక్కారు.

Ram Charan

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan), ఉపాసన కొణిదెల (Upasana Konidela) తమ ముద్దుల కూతురు క్లిన్ కారా (Klin Kaara)ను స్కూల్ నుంచి తీసుకెళ్తూ కెమెరాలకు చిక్కారు. ఒకవైపు పాన్-ఇండియా సినిమాల షూటింగ్‌లు, మరోవైపు వ్యాపార, సేవా కార్యక్రమాలతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ.. తమ గారాల పట్టి కోసం ఈ జంట ప్రత్యేకంగా సమయం కేటాయించడం అందరినీ ఆకట్టుకుంటోంది. స్కూల్ వద్ద సాధారణ తల్లిదండ్రుల్లాగే ఎంతో ఆప్యాయంగా పాపను తీసుకెళ్తున్న దృశ్యాలు చూపరులకు ఎంతో ముచ్చటగా అనిపిస్తున్నాయి.


క్లిన్ కారా పుట్టినప్పటి నుంచి రామ్ చరణ్, ఉపాసన దంపతులు ఆమె ప్రైవసీ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ వస్తున్న విషయం తెల్సిందే. దాదాపు మూడేళ్ల వరకు కూడా మెగా ప్రిన్సెస్ ముఖాన్ని అభిమానులకు చూపించలేదు. ఈ ఏడాది క్లీన్ కారా పుట్టినరోజున ఆమె ముఖాన్ని చూపించారు. చిన్నారికి మూడేళ్లు దాటడంతో స్కూల్ లో జాయిన్ చేసిన చరణ్ దంపతులు.. నిత్యం కూతురిని స్కూల్ వద్ద దింపి, తీసుకెళ్తున్నారు. ఈ ఫోటోలలో మెగా ప్రిన్సెస్ క్లిన్ కారా క్యూట్ లుక్స్, అమాయకమైన హావభావాలు, ముద్దులొలికే చిరునవ్వు చూసి మెగా అభిమానులు, నెటిజన్లు ఫిదా అవుతున్నారు. అచ్చం నాన్నలాగే ఉంది, చాలా క్యూట్‌గా ఉంది అంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.


మరోపక్క రామ్ చరణ్, ఉపాసన దంపతుల ఈ సింప్లిసిటీ, ఫ్యామిలీ బాండింగ్ పట్ల నెటిజన్ల నుంచి ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. ఎంత డబ్బు ఉన్నా కూతురి కోసం ఇలా స్కూల్ వద్దకి వచ్చి తీసుకెళ్లడం చాలా మంచి విషయమని, చరణ్ - ఉపాసన దంపతులు మంచి తల్లిదండ్రులని ప్రశంసిస్తున్నారు. చరణ్ సినిమాల విషయానికొస్తే .. ప్రస్తుతం ఆయన ఆర్సీ 17 తో బిజీగా ఉన్నాడు. సుకుమార్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా కోసం బీస్ట్ మోడ్ లో కనిపించనున్నాడు. త్వరలోనే ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్లనుంది. మరి రంగస్థలం లాంటి భారీ హిట్ తరువాత సుక్కు- చరణ్ నుంచి వస్తోన్న ఆర్సీ 17 ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.

Updated Date - Nov 24 , 2026 | 10:12 PM