అభయాంజనేయస్వామికి.. మెగా హీరోల పూజలు
ABN , Publish Date - Sep 30 , 2026 | 07:48 AM
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మంగళవారం గండిపేట ప్రసిద్ధ శ్రీ అభయ ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ramcharan), మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej) మంగళవారం గండిపేట (Gandipet)లోని ప్రసిద్ధ శ్రీ అభయ ఆంజనేయ స్వామి ఆలయం (Sri Abhaya Anjaneya swamy temple) లో ప్రత్యేక పూజలు చేశారు.
హనుమాన్ దీక్షలో ఉన్న వరుణ్ తేజ్ ఆలయానికి రాగా, రామ్ చరణ్ కూడా ఆయనతో కలసి స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామి వారికి వారు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం అర్చకులు వీరికి వేద ఆశీర్వచనాలు అందించి, స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.