'ఉస్తాద్ భగత్ సింగ్'ను వీక్షించిన మెగా ఫ్యామిలీ 

ABN , Publish Date - Mar 21 , 2026 | 05:57 PM

మెగాస్టార్ చిరంజీవి కుటుంబ సభ్యులు 'ఉస్తాద్‌ భగత్ సింగ్' (Ustaad Bhagat Singh) చిత్రాన్ని వీక్షించారు.

మెగాస్టార్ చిరంజీవి (Mega Family) కుటుంబ సభ్యులు 'ఉస్తాద్‌ భగత్ సింగ్' (Ustaad Bhagat Singh) చిత్రాన్ని వీక్షించారు. రామానాయుడు స్టూడియోలో ఏర్పాటు చేసిన ప్రత్యేక షోను చిరంజీవి, సురేఖ, పవన్, అన్నాలెజినోవా దంపతులు ఆద్యంతం ఆస్వాదించారు.  మైత్రీ నిర్మాతలు, అనిల్‌ రావిపూడి, పలువురు ప్రముఖులు మెగా బ్రదర్స్‌తో కలిసి ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ వీక్షించారు. 

చిరంజీవి నటించిన 'గ్యాంగ్ లీడర్' సినిమాలో 'వాన వాన వెల్లువాయే' పాటను ఈ సినిమాలో బిట్ గా వాడారు. ఆ పాటను తెరపై చూసి చిరు మురిసిపోయారు. సురేఖ సైతం ఎంజాయ్ చేశారు.  'తొలిప్రేమ' లోని ఈ మనసై  సాంగ్ ను సైతం చిరు బాడీని షేక్  చేస్తూ ఆస్వాదించారు. తదుపరి పవన్‌, దర్శకుడు హరీశ్‌శంకర్‌ను ఆయన అభినందించారు. చిత్ర యూనిట్ పడ్డ కష్టానికి తగిన ప్రతిఫలం దక్కిందని, ప్రేక్షకులకు ఒక మంచి వినోదాత్మక చిత్రాన్ని అందించారని ఆయన ప్రశంసించారు. మెగాస్టార్ ప్రశంసలతో చిత్ర బృందం రెట్టింపు ఉత్సాహంలో మునిగిపోయింది.

Updated Date - Mar 21 , 2026 | 07:01 PM