తిరుమల శ్రీవారి చెంత.. మెగా ఫ్యామిలీ! మనవడికి తలనీలాల సమర్పణ
ABN , Publish Date - Oct 02 , 2026 | 10:40 AM
మెగా బ్రదర్, ఎమ్మెల్సీ నాగబాబు, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ శుక్రవారం తిరుమల శ్రీనివాసుడిని దర్శించుకున్నారు
మెగా బ్రదర్, ఎమ్మెల్సీ నాగబాబు (Naga babu), మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun tej), లావణ్య కొణిదెల (Lavanya Tripathi) , నిహారిక (Niharika Konidela) లు శుక్రవారం తిరుమల శ్రీనివాసుడిని (Tirumala Swamy vari Darshan) దర్శించుకున్నారు.
శ్రీవారి దర్శనార్ధం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్న వీరు విఐపి బ్రేక్ దర్శన సమయంలో స్వామి వారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం పలకగా ఆలయ అధికారులు స్వామి వారీ వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్ధ ప్రసాదాలను అందజేశారు.
తిరుమలేశునికి నాగబాబు, తన మనవడు వరుణ్ తేజ్ కుమారుడు వాయువ్ తేజ్ పుటెంట్రుకలు శ్రీవారికి సమర్పించి మొక్కులు చెల్లించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే వాయువ్ తేజ్ ఫేస్‌ను సోషల్ మీడియా వేదికగా లావణ్య, వరుణ్ దంపతులు రివీల్ చేసిన విషయం తెలిసిందే.