Chiranjeevi: శరవేగంగా.. మెగా 158! కెరీర్‌లోనే.. అత్యంత శక్తిమంతమైన పాత్రలో చిరంజీవి

ABN , Publish Date - Jun 04 , 2026 | 07:32 AM

మెగాస్టార్‌ చిరంజీవి కథానాయకుడిగా బాబీ కొల్లి తెరకెక్కిస్తున్న చిత్రం ‘మెగా 158’ ఇటీవలే ప్రారంభమైన సంగతి తెలిసిందే.

Chiranjeevi

మెగాస్టార్‌ చిరంజీవి (Chiranjeevi) కథానాయకుడిగా బాబీ కొల్లి (Bobby Kolli) తెరకెక్కిస్తున్న చిత్రం ‘మెగా 158’ (వర్కింగ్‌ టైటిల్‌) ఇటీవలే ప్రారంభమైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ శరవేగంగా సాగుతోంది. తాజాగా పొల్లాచ్చిలో జరుగుతున్న కీలక షెడ్యూల్‌లో చిరంజీవితో పాటు ఇతర తారాగణంపై ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.

ఇందులో తన కెరీర్‌లోనే అత్యంత శక్తిమంతమైన పాత్రలో కనిపించనున్నారు చిరంజీవి. శారీరకంగా ధృఢంగా కనిపించడానికి కఠోర సాధన చేశారు. పూర్తి స్థాయి మాస్‌ అంశాలతో సాగే ఈ సినిమాలో చిరంజీవి పాత్ర రెండు కోణాల్లో సాగనున్నట్లు సమాచారం. కేవీఎన్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై వెంకట్‌ కే నారాయణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

ఈ చిత్రానికి ఎడిటర్‌: ఆంటోని రూబెన్‌, డీఓపీ: విజయ్‌కార్తిక్‌ కన్నన్‌, సంగీతం: థమన్‌ ఎస్‌. చిరంజీవి, బాబీ కొల్లి కలయికలో వచ్చిన ‘వాల్తేరు వీరయ్య’ ఘనవిజయం సాధించడంతో ఈ కాంబోపై అందరిలోనూ భారీ అంచనాలు ఉన్నాయి. వాటిని అందుకోవడానికి మరింత పెద్ద కాన్వాస్‌ ఉన్న కథను సిద్ధం చేశారు బాబీ కొల్లి. Mega158 shooting update

అభిమానులు ఇప్పటివరకూ చూడని సరికొత్త చిరంజీవిని ఈ మూవీలో చూస్తారని మేకర్స్‌ హామీ ఇచ్చారు. ప్రతీ సన్నివేశం గుర్తుండిపోయేలా ఉంటుందని చెప్పారు. త్వరలోనే హీరోయిన్‌తో పాటు ఇతర వివరాలను వెల్లడిస్తామని తెలిపారు.

Updated Date - Jun 04 , 2026 | 07:38 AM