Mana ShankaraVaraPrasad Garu: ఏ.. మీసాల పిల్ల వీడియో సాంగ్ వచ్చేసిందిరోయ్
ABN , Publish Date - Feb 02 , 2026 | 01:46 PM
మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi), నయనతార (Nayanthara) జంటగా అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం మన శంకరవరప్రసాద్ గారు (Mana ShankaraVaraPrasad Garu).
Mana ShankaraVaraPrasad Garu: మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi), నయనతార (Nayanthara) జంటగా అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం మన శంకరవరప్రసాద్ గారు (Mana ShankaraVaraPrasad Garu). సంక్రాంతి కానుకగా రిలీజైన ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకోవడంతో పాటు అద్భుతమైన కలక్షన్స్ ని అందించింది. ముఖ్యంగా కొన్నేళ్లుగా మంచి హిట్ లేని చిరంజీవికి భారీ విజయాన్ని అందించింది. వింటేజ్ చిరు కామెడీ, డ్యాన్స్, ఎమోషన్స్ అన్ని సమపాళ్ళుగా ఉండడంతో మన శంకరవరప్రసాద్ గారు సినిమా ప్రేక్షకులను అలరించింది.
ఇక ఈ సినిమాలోని సాంగ్స్ ప్రేక్షకులను మరింత అలరించాయి. ముఖ్యంగా మీసాల పిల్ల సాంగ్ ఇప్పటికీ టాప్ ట్రెండింగ్ లో కొనసాగుతోంది. తాజాగా ఈ సాంగ్ వీడియోను మేకర్స్ రిలీజ్ చేశారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించిన మీసాల పిల్ల వీడియో సాంగ్ యూట్యూబ్ లో రిలీజ్ అయిన కొద్దీ క్షణాల్లోనే వైరల్ గా మారింది. చిరు డ్యాన్స్, ఆ గ్రేస్.. నయన్ ఎక్స్ ప్రెషన్స్ అద్భుతంగా ఉన్నాయి.
విడిపోయిన భార్యాభర్తలు.. ఒకరి గురించి తమ మనస్సులోని మాటలను చెప్తున్నట్లు వచ్చే లిరిక్స్ ని భాస్కరభట్ల అద్భుతంగా రాశారు. ఆ లిరిక్స్ ని తమ గానంతో మరో లెవెల్ కి తీసుకువెళ్లారు సింగర్స్ ఉదిత్ నారాయణ్, శ్వేతా మోహన్. ఇక చిరు,నయన్ లుక్స్ సాంగ్ కు మరింత అందాన్ని తెచ్చాయి. ఇప్పటికే మీసాల పిల్ల ఆడియో సాంగ్ రికార్డులు సృష్టించింది. మరి ఇప్పుడు వీడియో సాంగ్ ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.