Mayukha: పాయల్ చెంగప్ప ‘మయూఖ’.. సీట్ ఎడ్జ్ థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియన్స్‌కు హామీ!
ABN , Publish Date - Sep 28 , 2026 | 07:08 PM
పాయల్ చెంగప్ప ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా 'మయూఖ'. ప్రశ్విత ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ పై శశిధర్ నల్ల నిర్మిస్తున్నారు.
పాయల్ చెంగప్ప ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా 'మయూఖ'. ప్రశ్విత ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ పై శశిధర్ నల్ల నిర్మిస్తున్నారు. శ్రీ తేజ్ ఎస్.కె. దర్శకత్వం వహిస్తున్నారు. నిర్మాణాంతర కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా అక్టోబర్ 9న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. సోమవారం హైదరాబాద్ లో ఈ చిత్ర ట్రైలర్ లాంఛ్ జరిగింది
ప్రొడ్యూసర్ శశిధర్ నల్ల మాట్లాడుతూ "మయూఖ సినిమా అద్భుతంగా వచ్చింది. ట్రైలర్ లాగే సినిమా కూడా మీ అందరినీ ఆకట్టుకుంటుందని నమ్ముతున్నాం. ఈ సినిమా తర్వాత మా హీరోయిన్ పాయల్ ను అందరూ మయూఖ అని పిలుస్తారు. ఈ సినిమా కోసం పాయల్ చాలా హార్డ్ వర్క్ చేసింది. మా సినిమాకు ఎ టు జడ్ అన్నీ తానై చూసుకున్నాడు మా డైరెక్టర్ శ్రీ తేజ్. అక్టోబర్ 9న దసరా సెలవుల్లో వరల్డ్ వైడ్ థియేట్రికల్ రిలీజ్ కు తీసుకొస్తున్నాం" అన్నారు.
పాయల్ చెంగప్ప మాట్లాడుతూ "ఫీమేల్ ఒరియెంటెడ్ థ్రిల్లర్ మూవీ. ఇప్పుడు సినిమాల పరిస్థితి ఎలా ఉందో మనం చూస్తున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో ఒక ఫీమేల్ ఒరియెంటెడ్ మూవీ చేయాలంటే ధైర్యం ఉండాలి. అలాంటి గట్స్ తో మా ప్రొడ్యూసర్ శశిధర్ గారు ఈ సినిమా ప్రొడ్యూస్ చేశారు. డైరెక్టర్ గారు ఈ కథ చెప్పినప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. కథ వింటున్నంత సేపూ థ్రిల్ ఫీల్ కలిగింది. కొన్ని పరిస్థితులను ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు ఆ అమ్మాయి ఎలా రియాక్ట్ అవుతుంది అనేది గూస్ బంప్స్ తెప్పించింది. ఈ సినిమా మీకు కొత్త ఫీల్ కలిగిస్తుంది' అని అన్నారు.
డైరెక్టర్ శ్రీ తేజ్ ఎస్ . కె. మాట్లాడుతూ "నా స్క్రిప్ట్ ను నమ్మి పాయల్ మూవీ ఒప్పుకున్నారు. మా ప్రొడ్యూసర్ శశిధర్ గారు నాకు దర్శకుడిగా తొలి అవకాశం కల్పించారు. తెలుగు చిత్రాల్లో "మయూఖ" లాంటిది అరుదుగా వస్తుందని చెప్పగలను. హాలీవుడ్, కొరియన్ మూవీలా కలర్ గ్రేడింగ్ చేశాం. మీకు ట్రైలర్ లో ఆ క్వాలిటీ కనిపిస్తుంటుంది. మీరు మా సినిమా కోసం థియేటర్ కు వెళ్తే సీట్ ఎడ్జ్ థ్రిల్లింగ్ ఎక్సిపీరియన్స్ ఇస్తామని హామీ ఇస్తున్నా. ప్రేక్షకులకు ఒక డిఫరెంట్ ఎక్సిపీరియన్స్ ఇవ్వాలనే ఈ సినిమా రూపొందించాను" అన్నారు.