అమ్మ చివరి కోరిక.. సినిమాలకు భరత్ దూరం.. ఇదిగో క్లారిటీ

ABN , Publish Date - Nov 14 , 2026 | 07:46 PM

టాలీవుడ్‌లో చైల్డ్ ఆర్టిస్టుగా ఎన్నో చిత్రాల్లో నటించి ప్రేక్షకులను అలరించిన మాస్టర్ భరత్ (Master Bharath) గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

Master Bharath

టాలీవుడ్‌లో చైల్డ్ ఆర్టిస్టుగా ఎన్నో చిత్రాల్లో నటించి ప్రేక్షకులను అలరించిన మాస్టర్ భరత్ (Master Bharath) గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగు, తమిళ్ భాషల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న భరత్ ఆ తరువాత నటుడిగా మారి పలు సినిమాల్లో కూడా కనిపించాడు. అయితే ఈమధ్యనే భరత్ తల్లి మరణించిన వార్త కూడా విదితమే. తల్లి మరణం తరువాత భరత్ చాలా క్రుంగిపోయాడు. ఆ సమయంలోనే అతను ఇండస్ట్రీకి దూరం అవుతున్నాడని, తల్లి చివరి కోరికగా డాక్టర్ కావాలనుకుంటున్నాడని వార్తలు వచ్చాయి.


తాజాగా సోషల్ మీడియాలో తనపై వస్తున్న రూమర్లపై భరత్ స్పష్టమైన క్లారిటీ ఇచ్చాడు. తాను నటనను వదిలేస్తున్నానంటూ నెట్టింట జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదని ఆయన తేల్చిచెప్పాడు. తనపై ప్రేక్షకులు చూపుతున్న ప్రేమకు ఎప్పటికీ రుణపడి ఉంటానని తెలిపాడు. 'నా తల్లి కోరిక మేరకే నేను నటనకు దూరమవుతున్నానని, పూర్తిగా డాక్టర్ వృత్తిపైనే ఫోకస్ పెడుతున్నానని సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు ప్రచారం జరుగుతున్నాయి. అయితే అందులో ఏమాత్రం నిజం లేదు. అమ్మకు నేను ఒక మంచి నటుడిగా చూడాలని కోరిక ఉంది. అలాగే డాక్టర్ చదువును కూడా నేను కొనసాగిస్తున్నాను. నేను నటనను ఎప్పటికీ వదిలేది లేదు, సినిమాల్లో కంటిన్యూ అవుతాను' అని ఆయన స్పష్టం చేశాడు.


ప్రస్తుతం తన సినిమాల గురించి చెబుతూ.. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌లో ఒక ప్రాజెక్ట్‌కు కమిట్ అయ్యానని, మరో నాలుగు, ఐదు ప్రాజెక్ట్‌లు చర్చల దశలో ఉన్నాయని భరత్ వెల్లడించాడు. అలాగే త్వరలోనే ఒక హిందీ ప్రాజెక్ట్ కూడా చేయనున్నట్లు ఆయన తెలిపాడు. ప్రేక్షకులను అలరించేందుకు మరిన్ని మంచి పాత్రలతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు భరత్ చెప్పుకొచ్చాడు. మరి భరత్ మంచి ప్రాజెక్ట్ లతో ముందు ముందు హీరోగా మారతాడా.. ? లేదా అనేది చూడాలి.

Updated Date - Nov 14 , 2026 | 07:52 PM