Maruthi: రాజాసాబ్‌ తర్వాత రూటు మార్చిన మారుతి.. ఈసారి ప్లాన్ అదే

ABN , Publish Date - Oct 13 , 2026 | 04:01 PM

‘రాజాసాబ్‌’ తర్వాత దర్శకుడు మారుతి (Maruthi) నుంచి కొత్త సినిమా అప్డేట్ ఏమి రాలేదు. దాంతో వాట్ నెక్స్ట్ మారుతీ అంటూ సోషల్ మీడియా ప్రశ్నలు ఎదురవుతూనే ఉన్నాయి.

‘రాజాసాబ్‌’ తర్వాత దర్శకుడు మారుతి (Maruthi) నుంచి కొత్త సినిమా అప్డేట్ ఏమి రాలేదు. దాంతో వాట్ నెక్స్ట్ మారుతీ అంటూ సోషల్ మీడియా ప్రశ్నలు ఎదురవుతూనే ఉన్నాయి. అయితే తాజా సమాచారం ప్రకారం మారుతీ ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌ను సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది. ఈసారి తనకు బాగా కలిసొచ్చిన కామెడీ, వైవిధ్యమైన కాన్సెప్ట్‌లతో ప్రేక్షకులను అలరించేందుకు ప్లాన్‌ చేస్తున్నారట. అంతేకాదు.. ఈ చిత్రాన్ని పూర్తిగా కొత్తవాళ్లతో తెరకెక్కించాలనే ఆలోచనలో ఉన్నారట. గతంలో మారుతి తెరకెక్కించిన ‘భలే భలే మగాడివోయ్‌’, ‘మహానుభావుడు’ చిత్రాలు విభిన్నమైన కథాంశాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. హీరో పాత్రలోని ప్రత్యేక లక్షణాలను కామెడీకి జోడించి వినోదాన్ని పంచడంలో మారుతి తనదైన ముద్ర వేశారు.

ఇప్పుడు మరోసారి అలాంటి వైవిధ్యమైన కాన్సెప్ట్‌తో హిలేరియస్‌ ఎంటర్‌టైనర్‌ను రూపొందించాలని భావిస్తున్నారట.ఈ కొత్త ప్రాజెక్ట్‌ కోసం నవంబర్‌లో షూటింగ్‌ ప్రారంభించి, వచ్చే ఏడాది మార్చి నాటికి  పూర్తి   చేసే దిశగా ప్రణాళిక చేస్తున్నారని సమాచారం.  కథ, నటీనటుల ఎంపిక వంటి వివరాలపై మరింత స్పష్టత రావాల్సి ఉంది. ‘రాజాసాబ్‌’ తర్వాత మారుతి ఎలాంటి కథతో ప్రేక్షకుల ముందుకు వస్తారనే ఆసక్తి నెలకొంది. పూర్తిగా కొత్తవాళ్లతో ఆయన చేయబోయే ఈ ప్రయోగం ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.

Updated Date - Oct 13 , 2026 | 11:06 PM