మరీచీక ఎవరు.. అనుపమ యాక్టింగ్ పీక్స్
ABN , Publish Date - May 16 , 2026 | 03:44 PM
బేబీ ఫేమ్ విరాజ్ అశ్విన్ (Viraj Ashwin) హీరోగా సతీష్ కాసెట్టి దర్శకత్వం వహించిన చిత్రం మరీచిక (Mareechika). అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran), రెజీనా కసాండ్రా(Regina Kasandra) హీరోయిన్స్ గా నటించిన ఈ చిత్రాన్ని చిలకా బ్యానర్ పై రాజీవ్ చిలక, మేఘ చిలక నిర్మించారు.
బేబీ ఫేమ్ విరాజ్ అశ్విన్ (Viraj Ashwin) హీరోగా సతీష్ కాసెట్టి దర్శకత్వం వహించిన చిత్రం మరీచిక (Mareechika). అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran), రెజీనా కసాండ్రా(Regina Kasandra) హీరోయిన్స్ గా నటించిన ఈ చిత్రాన్ని చిలకా బ్యానర్ పై రాజీవ్ చిలక, మేఘ చిలక నిర్మించారు. ఇక ఈ సినిమాకు ఇళయరాజా సంగీతం అందించారు. ఇప్పటికే మరీచిక నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ని మేకర్స్ రిలీజ్ చేశారు. ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. సైకలాజికల్ థ్రిల్లర్ గా ఈ సినిమా తెరకెక్కినట్లు ట్రైలర్ చూస్తుంటే తెలుస్తుంది.
కథ విషయానికొస్తే.. సంజు( విరాజ్ అశ్విన్ ) ని అనుపమ ప్రేమిస్తుంది. ఆ విషయం తనకు చెప్పాలనుకుంటుంది. ఏంటో అమాయకంగా.. విలేజ్ లుక్ తో ఉండడంతో చెప్పడానికి భయపడుతుంది. ఇక అప్పుడే అమెరికా నుంచి మరీచిక( రెజీనా) ఇండియా వస్తుంది. ఆమె తెలుగు రాక ఇబ్బందిపడుతుంటే అనుపమనే హెల్ప్ చేస్తుంది. అలా ఫ్రెండ్స్ అయ్యాక సంజును మరీచికకు పరిచయం చేస్తుంది. అయితే మరీచిక, సంజు ప్రేమించుకుంటారు. అది చూసి అనుపమ తట్టుకోలేకపోతుంది. అలా ఒకరోజు సంజును మరీచిక చంపేయడం అనుపమ చూస్తుంది. ఆ విషయాన్నీ పోలీసులు నమ్మరు. అసలు మరీచిక ఎవరు.. ? సంజు ఎవరు.. ? అనుపమ ఎందుకు అలా బిహేవ్ చేస్తుంది.. ? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.
సినిమా మొత్తం అనుపమ చుట్టూనే తిరుగుతున్నట్లు కనిపిస్తోంది. రెండు షేడ్స్ లో ఆమె నటన నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. ఇక సినిమాకు హైలైట్ అంటే ఇళయరాజా సంగీతం. మొత్తానికి ట్రైలర్ తోనే సినిమాపై హైప్ క్రియేట్ చేశాడు డైరెక్టర్. మే 29 న మరీచిక రిలీజ్ కానుంది. మరి ఈ సినిమాతో అనుపమ ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.