పక్కా ఫ్యామిలీ ఎంటర్ టైనర్‌గా యస్ ఎల్ వి సినిమా

ABN , Publish Date - Feb 20 , 2026 | 03:07 PM

'మా ఊరి ప్రేమకథ' చిత్రంతో  హీరోగా పరిచయమైన మంజునాథ్ 'రౌడీ విక్రమ్', 'పక్కా ప్రేమికుడు' చిత్రాలలో నటిస్తున్నాడు. ఈ రెండు సినిమాలు షూటింగ్ చివరి దశలో ఉండగానే మరొక చిత్రానికి శ్రీకారం చుట్టారు.

'మా ఊరి ప్రేమకథ' చిత్రంతో  హీరోగా పరిచయమైన మంజునాథ్ 'రౌడీ విక్రమ్', 'పక్కా ప్రేమికుడు' చిత్రాలలో నటిస్తున్నాడు. ఈ రెండు సినిమాలు షూటింగ్ చివరి దశలో ఉండగానే మరొక చిత్రానికి శ్రీకారం చుట్టారు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి క్రియేషన్స్ (S L V) పతాకంపై నూతన దర్శకుడు అభిరామ్ గంటా దర్శకత్వంలో నూతన చిత్రాన్ని శుక్రవారం పూజ కార్యక్రమాలతో మొదలుపెట్టారు. వి. లక్ష్మీ దేవి నిర్మిస్తోన్న ఈ సినిమా ముహూర్తపు సన్నివేశానికి హీరో మంజునాథ్ క్లాప్ నివ్వగా, డీవోపీ శేఖర్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. దర్శకుడు అభిరామ్ గంటా గౌరవ దర్శకత్వం వహించారు. 

హీరో మంజునాథ్ మాట్లాడుతూ 'మా ఊరి ప్రేమకథ' తర్వాత 'రౌడీ విక్రమ్' సినిమాలో అవకాశం వచ్చింది. 'పక్కా ప్రేమికుడు'  సినిమాలో కూడా హీరోగా అవకాశం వచ్చింది. ఆ సినిమాల షూటింగ్ తొంబై శాతం పూర్తయింది. ఇప్పుడు ఇది మూడో సినిమా. అభిరాం గంటా చెప్పిన కథ నచ్చింది. ఇందులో ప్యాషన్ డిజైనర్ క్యారెక్టర్ చేస్తున్నాను. పక్కా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ చిత్రం ఇది' అని అన్నారు.


దర్శకుడు అభిరామ్ గంటా మాట్లాడుతూ 'వెబ్ సిరీస్ తీసిన అనుభవం ఉంది. ఇప్పుడు ఫీచర్ ఫిల్మ్ చేసే అవకాశం వచ్చింది.  లవ్, కామిడీ, సస్పెన్స్, ఎమోషన్, ఎంటర్టైన్మెంట్ అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఈ సినిమాలో ఉన్నాయి' అని అన్నారు. ఏప్రిల్ నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానున్న ఈ సినిమా గురించి మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేస్తామని నిర్మాత వి. లక్ష్మీ దేవి  తెలిపారు. 

Updated Date - Feb 20 , 2026 | 04:23 PM