Manjula ghattamaneni: జీవితంలో లభించిన విలువైన బహుమతి
ABN , Publish Date - Aug 28 , 2026 | 03:52 PM
సూపర్‌స్టార్ మహేశ్‌బాబు సోదరి, నటి, నిర్మాత మంజుల ఘట్టమనేని రక్షాబంధన్ సందర్భంగా భావోద్వేగ పోస్ట్ చేశారు.
సూపర్‌స్టార్ మహేశ్‌బాబు (Mahesh Babu) సోదరి, నటి, నిర్మాత మంజుల ఘట్టమనేని (Manjula Ghattamaneni) రక్షాబంధన్ (Raksha Bhandan) సందర్భంగా భావోద్వేగ పోస్ట్ చేశారు. తన సోదరులతో ఉన్న అనుబంధం గురించి చెబుతూ.. తోబుట్టువుల బంధం జీవితంలో లభించే అత్యంత విలువైన బహుమతుల్లో ఒకటని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మహేశ్‌బాబును ట్యాగ్ చేస్తూ ఆమె చేసిన పోస్ట్ అభిమానులను ఆకట్టుకుంటోంది.
'మన తోబుట్టువులతో ఉన్న బంధంలో ఏదో ప్రత్యేకమైన మాధుర్యం ఉంటుంది. జీవితంలోని ప్రతి దశను, మనలోని ప్రతి మార్పును మొదటి నుంచి చూసిన వాళ్లు వాళ్లే. మనలోని మంచి, చెడు రెండింటినీ చూశారు. ఎంతో ప్రేమతో ఉంటారు. ఒక తోబుట్టువు మనల్ని అర్థం చేసుకున్నంతగా మరెవరూ అర్థం చేసుకోలేరు. ముఖ్యంగా అన్నాచెల్లెలు, అక్కాతమ్ముడి బంధంలో ఎంతో ప్రత్యేకమైన అందం ఉంటుంది. ఎన్నో ఏళ్ల జ్ఞాపకాలు, అనుభవాలు, కలిసి గడిపిన క్షణాలు ఈ బంధాన్ని మరింత బలంగా మారుస్తాయి. ఈ రోజు నా సోదరుల గురించి, మేము పుట్టుకతోనే పొందిన ఈ అందమైన బంధం గురించి కృతజ్ఞతగా భావిస్తున్నాను. జీవితంలో లభించే అత్యంత విలువైన బహుమతుల్లో ఇదొకటి’’ అని మంజుల భావోద్వేగంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. రక్షాబంధన్ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆమె ఈ పోస్ట్‌ను షేర్ చేశారు. మహేశ్‌బాబును ప్రత్యేకంగా ట్యాగ్ చేయడంతో అభిమానుల దృష్టిని ఆకర్షించింది. మంజుల చేసిన ఈ ఎమోషనల్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.