బహిరంగంగా మంజు వారియర్‌కు లిప్‌కిస్..
ABN , Publish Date - Apr 07 , 2026 | 11:44 AM
అభిమానుల చేష్టలు (Fans) ఒక్కోసారి సెలబ్రిటీలకు ఇబ్బందికరంగా మారతాయి. హీరోయిన్లు షాపింగ్ మాల్స్ ఓపెనింగ్, బహిరంగ ప్రాంతాల్లో జరిగే ఈవెంట్‌లకు హాజరైనప్పుడు అభిమానులు అత్యుత్సాహం చూపిస్తారు.
అభిమానుల చేష్టలు (Fans) ఒక్కోసారి సెలబ్రిటీలకు ఇబ్బందికరంగా మారతాయి. హీరోయిన్లు షాపింగ్ మాల్స్ ఓపెనింగ్, బహిరంగ ప్రాంతాల్లో జరిగే ఈవెంట్‌లకు హాజరైనప్పుడు అభిమానులు అత్యుత్సాహం చూపిస్తారు. సెల్ఫీల కోసం ఎగబడతారు. తాకకూడని చోట తాకి వారి ఆగ్రహానికి గురవుతారు. తాజాగా మలయాళ బ్యూటీ మంజు వారియర్‌కు (Manju Waarier) ఇలాంటి ఇబ్బందే ఎదురైంది. ఇటీవల కేరళంలోని పాలక్కడ్‌లో ఓ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి అతిథిగా హాజరయ్యారు మంజు వారియర్. అక్కడ అభిమానులు విపరీతంగా గుమిగూడి సెల్ఫీల కోసం ఎగబడ్డారు. ఓ అభిమాని మాత్రం మంజూకు బలవంతంగా ముద్దు పెట్టింది. అది కూడా లిప్ కిస్. కాసేపు అక్కడున్నవారంతా ఉలిక్కిపడ్డారు. మంజు వారియర్ ఇబ్బందిగా ఫీలయ్యారు. అక్కడ యాంకర్‌గా వ్యవహరించిన వ్యక్తి వెంటనే స్పందిస్తూ.. ‘మన ఆహ్వానం మేరకు వచ్చిన అతిథులతో ఇలా ప్రవర్తించడం సరైన పద్థతి కాదు’ అభిమానులకు వార్నింగ్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
వారం క్రితం ఇలాంటి అనుభవమే ఇటీవల హనీరోజ్‌కు కూడా జరిగింది. షాపింగ్ మాల్ ఓపెనింగ్‌కు వెళ్లిన ఆమెతో సెల్ఫీలు దిగేందుకు ఫ్యాన్స్ ఎగబడ్డారు. ఈ క్రమంలోనే కొందరు అత్యుత్సాహవంతులు ఫొటోలు తీసుకునే క్రమంలో ఆమె నడుమును తాకుతూ అసభ్యంగా ప్రవర్తించారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కాగా, నెటిజన్లు సదరు వ్యక్తుల ప్రవర్తనను తీవ్రంగా ఖండించారు.