అమ్మోరు దిగినాది.. అమ్మోరే దిగినాది! పాట‌తో మంగ్లీ అద‌ర‌గొట్టేశాది

ABN , Publish Date - May 01 , 2026 | 06:49 AM

డిఫరెంట్‌ కంటెంట్‌తో రా అండ్‌ రస్టిక్‌గా రూపుదిద్దుకుంటున్న చిత్రం ‘అనకాపల్లి’.

Anakapalli

డిఫరెంట్‌ కంటెంట్‌తో రా అండ్‌ రస్టిక్‌గా రూపుదిద్దుకుంటున్న చిత్రం ‘అనకాపల్లి’ (Anakapalli). విక్రమ్‌ సహిదేవ్ (Vikram Sahidev), సంధ్య వశిష్ట (SandhyaVasishta) జంటగా నటించిన ఈ చిత్రానికి ప్ర‌ముఖ‌ దర్శకుడు నక్కిన త్రినాథరావు కథ, స్క్రీన్‌ప్లే అందించడమే కాకుండా ఓ ముఖ్య పాత్ర కూడా పోషించారు. ఖగేశ్‌ తమ్మినేని దర్శకత్వం వ‌హించాడు.

తాజాగా.. ఈ చిత్రం నుంచి ‘అమ్మోరు దిగినాది’ (Ammoru Diginadhi ) అంటూ సాగే జాతర సాంగ్‌ విడుదల చేశారు. ఈ పాట‌కు గ‌ణేశ్ సాలాది (Ganesh Saladhi) సాహిత్యం అందించ‌గా మంగ్లీ గాత్రం అందించింది. శేఖర్‌ మాస్టర్ (Sekhar Master)కొరియోగ్రఫీ, గ్రాండియర్‌గా పాటను తెరకెక్కించిన తీరు ఆకట్టుకుంటున్నాయి. ఈ సినిమాను జూన్‌ 5న విడుదల చేయనున్నట్లు నిర్మాతలు కండ్రేగుల నాయుడు, త్రినాథరావు నక్కిన వెల్లడించారు. ఇదిలాఉంటే.. పాట ప‌ల్ల‌వి అమ్మోరు దిగినాది.. అమ్మోరే దిగినాది మాత్రం చాలా కాలం ప్ర‌జ‌ల్లో నిలుస్తుంద‌న‌డంలో సందేహం లేదు.

Updated Date - May 01 , 2026 | 06:55 AM