కొరటాల శివ బ్యానర్‌లో మంగళవారం సీక్వెల్
ABN , Publish Date - Apr 18 , 2026 | 06:26 PM
రామ్‌గోపాల్ వర్మ శిష్యుడిగా తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టారు అజయ్ భూపతి.
రామ్‌గోపాల్ వర్మ శిష్యుడిగా తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టారు అజయ్ భూపతి (Ajay Bhupathi). తొలి చిత్రం 'ఆర్‌ఎక్స్100'తో దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. తదుపరి ‘మహా సముద్రం’ చిత్రం పరాజయాన్ని చవిచూసింది. మూడో సినిమా మంగళవారం సూపర్ సక్సెస్ అయ్యి మళ్లీ అజయ్‌కు ట్రాక్‌లోకి తెచ్చింది. ప్రస్తుతం ఆయన ఘట్టమనేని జయకృష్ణను హీరోగా పరిచయం చేస్తూ ‘శ్రీనివాస మంగాపురం’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. జూలైలో ఈ చిత్రం రిలీజ్ కానుంది.
మరోవైపు 'మంగళవారం 2' (Mangalavaram 2) చిత్రాన్ని తెరకెక్కించడానికి కూడా సన్నాహాలు చేస్తున్నారు. ఈ కథను దర్శకుడు కొరటాల శివకు వినిపించినట్లు తెలిసింది. కొరటాల శివ తన బ్యానర్ యువసుధా ఆర్ట్స్ ద్వారా యంగ్ డైరెక్టర్స్‌ను పరిచయం చేస్తున్న సంగతి తెలిసిందే. మంగళవారం సీక్వెల్‌కు కొరటాల సై అన్నారని సమాచారం. త్వరలో అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.