మైత్రీ చేతికి ‘మండాడి’.. రిలీజ్ డేట్ ఫిక్స్

ABN , Publish Date - Jul 18 , 2026 | 05:37 PM

ఎల్రెడ్ కుమార్ సమర్పణలో ఆర్ఎస్ ఇన్ఫోటైన్‌మెంట్ బ్యానర్ పై మతిమారన్ పుగళేంది తెరకెక్కిస్తోన్న చిత్రం ‘మండాడి’. ఈ మూవీని ఎల్రెడ్ కుమార్ నిర్మిస్తున్నారు.

Mandaadi Movie Update

ఎల్రెడ్ కుమార్ సమర్పణలో ఆర్ఎస్ ఇన్ఫోటైన్‌మెంట్ బ్యానర్ పై మతిమారన్ పుగళేంది తెరకెక్కిస్తోన్న చిత్రం ‘మండాడి’ (Mandaadi). ఈ మూవీని ఎల్రెడ్ కుమార్ నిర్మిస్తున్నారు. టాలీవుడ్ హీరో సుహాస్ (Suhas), కోలీవుడ్ హీరో సూరి (Soori) ముఖ్య పాత్రలను పోషిస్తున్న ఈ సినిమా నుంచి ఇప్పటి వరకు విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ మంచి స్పందనను రాబట్టుకున్న విషయం తెలిసిందే. సుహాస్, సూరి పాత్రలు, ఆ కారెక్టర్స్ మేకోవర్ అన్నీ కూడా సినిమాపై భారీగా అంచనాలను పెంచేశాయి. ఇక ఈ సినిమాలోని యాక్షన్ సీక్వెన్స్, విజువల్స్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని టీం నమ్మకంగా చెబుతోంది. బోట్ సీక్వెన్స్ అందరూ ఆశ్చర్యపోయేలా ఉంటాయని ఆల్రెడీ టీం ప్రకటించింది. తాజాగా ఈ మూవీకి సంబంధించి మేకర్స్ ఓ అప్డేట్ ఇచ్చారు.


ఈ మూవీని సెప్టెంబర్ 10న గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతున్నారు. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో పాన్ ఇండియా సినిమాగా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాని తెలుగులో మైత్రి మూవీస్ రిలీజ్ చేయబోతోంది. ఏపీ, తెలంగాణ స్టేట్స్‌లో ఈ చిత్రాన్ని మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ఎల్ఎల్‌పి (Mythri Movie Distributors LLP) భారీ ఎత్తున విడుదల చేయనుందని మేకర్స్ అధికారిక ప్రకటన విడుదల చేశారు. దీంతో ఈ సినిమాపై మరింతగా క్రేజ్ ఏర్పడుతోంది. ఇందులో మంచి కంటెంట్ ఉంది కాబట్టే.. మైత్రీ చేతుల్లోకి వెళ్లిందనేలా.. అప్పుడే టాక్ కూడా మొదలైంది.


మహిమా నంబియార్ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రంలో సత్యరాజ్, రవీంద్ర విజయ్, మిథున్, బాల శరవణన్ తదితరులు ఇతర కీలక పాత్రలను పోషించారు. ఈ సినిమాకి సంగీతాన్ని జి.వి. ప్రకాష్ కుమార్ అందించగా, ఎస్.ఆర్. కథిర్ సినిమాటోగ్రఫర్‌గా పని చేశారు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన మరింత ప్రమోషనల్ కంటెంట్‌ని వదిలడంతో పాటు, టీమ్ కూడా మీడియాతో ముచ్చటించనుందని తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి:

విక్రమ్-1 రాకెట్ విజయంపై మెగాస్టార్ చిరంజీవి పోస్ట్ వైరల్..

RC17 Update: చరణ్, సుక్కు సినిమా మొదలయ్యేది అప్పుడేనా..

నాట్ ఈజీ.. కానీ, రోజూ ఒక గంటసేపు చేయండి: అనసూయ

Updated Date - Jul 18 , 2026 | 05:37 PM