మంచు మనోజ్ - మౌనిక: ఆ ధైర్యంతోనే.. బలంగా ముందుకెళ్తున్నారు
ABN , Publish Date - Mar 03 , 2026 | 08:11 PM
మంచు మనోజ్, మౌనికా రెడ్డి మూడవ వివాహ వార్షికోత్సవాన్ని సెలెబ్రేట్ చేసుకున్నారు. సన్నిహితులు, కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషుల మధ్య ఈ వేడుకలు ఘనంగా జరిగాయి
మంచు మనోజ్(Manchu manoj), మౌనికా రెడ్డి మూడవ వివాహ వార్షికోత్సవాన్ని సెలెబ్రేట్ చేసుకున్నారు. సన్నిహితులు, కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషుల మధ్య ఈ వేడుకలు ఘనంగా జరిగాయి. మూడు సంవత్సరాల వైవాహిక బంధం తర్వాత మనోజ్ - భూమ కుటుంబం మరింత అందంగా పెరిగింది. కుమారుడు ధైరవ్‌తో పాటు ఏప్రిల్ 2, 2024న జన్మించిన దేవసేన శోభ ఎంఎంతో మనోజ్, మౌనికల జీవితం మరింత అందంగా, ఆదర్శవంతంగా మారింది. వృత్తిపరంగా మనోజ్‌కి వివాహాం తరువాత మరింత కలిసి వచ్చింది. ‘భైరవం’, ‘మిరాయ్’ అంటూ వరుసగా హిట్లు అందుకున్నారు. ప్రేక్షకుల్లో మనోజ్‌కి ఉన్న చెరగని ప్రేమకు, అభిమానానికి ఈ చిత్రాలకు లభించిన ఆదరణే నిదర్శనం.
ఎన్ని కష్టాలు వచ్చినా మంచు మనోజ్, భూమా మౌనిక ధైర్యంగా ఎదుర్కొంటారు. ఆ ధైర్యమే వారికి ప్రధాన బలం. కష్టాల్లో ఒకరికొకరు తోడుగా నిలుస్తున్నారు. కింది స్థాయి నుంచి జీవితాన్ని మొదలు పెట్టి ఇప్పుడు అందరూ మెచ్చుకునే స్థాయి వరకు ఎదిగారు. ఎప్పుడూ తమ వారి కోసం అందుబాటులో ఉంటుందీ జంట. ఇతరులకు సాయమందించడం, సేవలో చేయడంలో ఎప్పుడూ ముందుంటారు. అలాంటి మనోజ్, మౌనికలు ఇంకా ఎన్నో వివాహా దినోత్సవాల్ని జరుపుకోవాలని, ఇలానే ఎప్పుడూ కలిసి ఉండాలని అభిమానులు కోరుకుంటున్నారు.
ప్రస్తుతం మనోజ్ ‘డేవిడ్ రెడ్డి’ షూటింగ్‌తో బిజీగా ఉన్నారు. ఇది ఇప్పటికే భారీ అంచనాల్ని క్రియేట్ చేసింది. ఇంకా మరిన్ని ప్రాజెక్టుల్ని మనోజ్ పట్టాలెక్కించే పనిలో ఉన్నారు. ఇక సినిమాలే కాకుండా మనోజ్ గత ఏడాది నవంబర్‌లో మోహన రాగ మ్యూజిక్‌ను ప్రారంభించారు. కొత్త వారిని, నూతన ప్రతిభను ప్రోత్సహించడానికి ప్రపంచ వేదికపై తెలుగు సంగీతాన్ని ఉన్నతీకరించడానికి అంకితమైన మ్యూజిక్ లేబుల్‌గా ఇది రానుంది.
మౌనిక సైతం తన సొంత సామ్రాజ్యాన్ని నిర్మించుకుంటున్నారు. ‘నమస్తే వరల్డ్ సెలబ్రేటింగ్ కిడ్స్’ ఫౌండర్, సీఈవోగా స్వదేశీ బొమ్మల బ్రాండ్‌ను ప్రారంభించారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా మూడు వందలకు పైగా రిటైల్ స్టోర్‌లలో 75 వేల యూనిట్లకు పైగా విక్రయించారు. వీటిలో హామ్లీస్, మదర్‌కేర్, అమెజాన్, ఫస్ట్‌క్రై అన్నీ పూర్తిగా స్వయం నిధులతో, జీరో పెయిడ్ ప్రమోషన్‌లతో ఉన్నాయి. ఈ బ్రాండ్ రిలయన్స్‌తో పంపిణీ భాగస్వామ్యాన్ని పొందింది. ఇప్పుడు దాని డైరెక్ట్ టు కన్జ్యూమర్ కార్యకలాపాలను విస్తరించడానికి సిద్ధమవుతోంది. నమస్తే వరల్డ్‌ని మౌనిక కేవలం ఒక వ్యాపారంగా చూడటం లేదు. భారతదేశంలో తయారు చేసిన, సాంస్కృతికంగా పెనవేసుకున్న బొమ్మలను ప్రతి పిల్లల చేతుల్లోకి చేర్చాలని ఆమె తపిస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ మనోజ్, మౌనిక జంటకి ఉండే క్రేజ్, ఫాలోయింగ్.. అభిమానులు వారిపై చూపించే ప్రేమ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వీరిద్దరి రాజకీయ ఎంట్రీ కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. మరి భవిష్యత్తులో ఎవరు ఎలాంటి నిర్ణయాల్ని తీసుకుంటారో వేచి చూడాలి.