ప్రైవేట్ పార్ట్స్ పంపిస్తున్నారు.. మంచు లక్ష్మీ సంచలన వ్యాఖ్యలు

ABN , Publish Date - Aug 10 , 2026 | 07:52 PM

మంచు లక్ష్మీ సోషల్ మీడియాలో అత్యధికంగా ట్రోలింగ్‌కు గురైన సెలబ్రిటీలలో ఒకరు అని చెప్పడంలో ఆశ్చర్యం లేదు. ఎంత మోహన్ బాబు కూతురు అయినా కూడా ఆమె మాట్లాడే తెలుగును ట్రోల్ కంటెంట్ కింద మార్చుకున్నారు చాలామంది.

Manchu Lakshmi

మంచు లక్ష్మీ (Manchu Lakshmi) సోషల్ మీడియాలో అత్యధికంగా ట్రోలింగ్‌కు గురైన సెలబ్రిటీలలో ఒకరు అని చెప్పడంలో ఆశ్చర్యం లేదు. ఎంత మోహన్ బాబు కూతురు అయినా కూడా ఆమె మాట్లాడే తెలుగును ట్రోల్ కంటెంట్ కింద మార్చుకున్నారు చాలామంది. ఒకరకంగా అది ఆమెకు ప్లస్ అయినా కూడా.. మరో రకంగా ఆమె ఎమోషనల్ గా బాగా డిస్ట్రబ్ అవ్వడానికి కారణం అయ్యింది. తాజాగా ఒక షోలో మంచు లక్ష్మీ ట్రోలింగ్, డిప్రెషన్, సోషల్ మీడియాలో ఎదురవుతున్న వేధింపులపై సంచలన వ్యాఖ్యలు చేసింది. తనపై అసలు ట్రోలింగ్ మొదలవ్వడానికి కారణం వైవా హర్ష అంటూ బాంబ్ పేల్చింది.


ఆహా వేదికగా ప్రసారమవుతున్న టాప్ తెలుగు ఇన్ ఫ్లుయెన్సర్ అనే షోకి మంచు లక్ష్మీ, వైవా హర్ష జడ్జీలుగా వ్యవహరిస్తోన్న విషయం తెల్సిందే, రష్మీ హోస్ట్ గా కనిపిస్తున్న ఈ షోలో కొంతమంది ఇన్ ఫ్లుయెన్సర్.. జడ్జీలు ఇచ్చిన టాస్క్ లు పూర్తి చేసి వారిని మెప్పించాలి. ఇప్పటివరకు 6 ఎపిసోడ్స్ ని విజయవంతంగా పూర్తిచేసిన ఈ షో తాజాగా ఏడో ఎపిసోడ్ ప్రోమోని రిలీజ్ చేసింది. ఈ ప్రోమోలో మంచు లక్ష్మీ ట్రోలింగ్, డిప్రెషన్, సోషల్ మీడియాలో వచ్చే వేధింపులపై కీలక వ్యాఖ్యలు చేసింది. 'ఈ రోజుల్లో డిప్రెషన్, యాంగ్జైటీలకు అతిపెద్ద కారణం ట్రోలింగే' అని రష్మి గౌతమ్ ప్రస్తావించగా. . దానికి మంచు లక్ష్మి స్పందిస్తూ 'నన్ను ట్రోల్ చేయడం హర్ష నుంచే ప్రారంభమైంది. అతడు చేసిన కొన్ని విషయాలు నన్ను తీవ్రంగా ప్రభావితం చేశాయి' అని చెప్పుకొచ్చింది.


ఇక దీనికి వైవా హర్ష వెంటనే స్పందిస్తూ.. 'మీరు బాధపడి ఉంటే నిజంగా క్షమించండి. కానీ నేను ఉద్దేశపూర్వకంగా అలా చేయలేదు' అని వివరణ ఇచ్చాడు. అప్పటి నుంచి సోషల్ మీడియా వేధింపులు ఏ స్థాయికి చేరాయో వివరిస్తూ మంచు లక్ష్మీ సంచలన వ్యాఖ్యలు చేసింది. 'ఇప్పుడు పరిస్థితులు మరింత దిగజారిపోయాయి. కొందరు వ్యక్తులు తమ ప్రైవేట్ పార్ట్స్ ఫోటోలను కూడా నాకు పంపిస్తున్నారు" అని ఆవేదన వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మోహన్ బాబు కూతురికే ఈ రేంజ్ లో ఉంటే సాధారణ అమ్మాయిల పరిస్థితి ఏంటి అని పలువురు నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు.

Updated Date - Aug 10 , 2026 | 07:52 PM