Mana ShankaraVaraPrasad Garu Trailer: శంకర వరప్రసాద్ .. తప్పు చేసినోడిని కోసి కారం పెడతాడు
ABN , Publish Date - Jan 04 , 2026 | 05:32 PM
మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi), నయనతార (Nayanthara) జంటగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం మన శంకర వరప్రసాద్ గారు (Mana Shankara Vara Prasad Garu).
Mana ShankaraVaraPrasad Garu Trailer: మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi), నయనతార (Nayanthara) జంటగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం మన శంకర వరప్రసాద్ గారు (Mana Shankara Vara Prasad Garu). షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటితో కలిసి సుస్మిత కొణిదెల ఈ సినిమాను నిర్మిస్తుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. సంక్రాంతి కానుకగా జనవరి 12 న ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతున్న సమయంలో ప్రమోషన్స్ వేగాన్ని పెంచిన మేకర్స్ తాజాగా మన శంకర వరప్రసాద్ గారు ట్రైలర్ ని రిలీజ్ చేశారు.
ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. అనిల్ రావిపూడి కామెడీ మార్క్ ట్రైలర్ లో కనిపిస్తుంది. ఎలాంటి క్రిమినల్ ని అయినా ఉతికి పిండి ఆరేసే శంకర వరప్రసాద్.. ఒక సెక్యూరిటీ ఏజెన్సీని నడిపిస్తూ ఉంటాడు. అతనికి శశిరేఖతో పెళ్లి అవుతుంది.. విభేదాల వలన వారు విడిపోతారు. ఇక కొన్ని అనుకోని కారణాల వలన ఈ మాజీ జంట కలవాల్సిన పరిస్థితి వస్తుంది. వారిద్దరి మధ్య జరిగే అల్లరినే ఈ సినిమా అని తెలుస్తోంది. అయితే వీరిద్దరూ విడిపోవడానికి కారణం ఎవరు.. ? భార్య దగ్గరకు శంకర వరప్రసాద్ మళ్లీ ఎందుకు వచ్చాడు అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.
కామెడీ చేయడంలో చిరును మించిన హీరో ఇంకెవరు ఉండరు అంటే అతిశయోక్తి లేదు. ఇక ఈ ట్రైలర్ ని చూస్తే చాలా సినిమాలు మైండ్ లోకి రాకుండా మానవు. ముఖ్యంగా అజిత్, నయనతార నటించిన విశ్వాసం కళ్ళముందు మెదులుతుంది. బాగా దబ్బున అమ్మాయి.. ఏమి లేని అబ్బాయి ప్రేమించుకుంటారు.. పెళ్లి చేసుకుంటారు.. ఆ తరువాత గొడవల వలన విడిపోతారు. మళ్లీ అమ్మాయికి కష్టం ఉందని తెలిస్తే.. అబ్బాయి ఆ ఇంటికి వచ్చి ఆ కష్టాన్ని తీరుస్తాడు.. చివరకు నిజం తెలుస్తోంది. మళ్లీ ఒకటి అవుతారు. ఇలాంటి కథనే మన శంకర వరప్రసాద్. దీన్ని అనిల్ తన స్టైల్ లో ఎలా తెరకెక్కించాడు అనేది చూడాలి. నయన్ కు ఇలాంటి పాత్రలు కొట్టిన పిండి. చిరు కూడా తన స్వాగ్ తో అదరగొట్టేశాడు. భీమ్స్ మ్యూజిక్ నెక్స్ట్ లెవెల్. ఇక చివర్లో వెంకీ ఎంట్రీ హైలైట్. మొత్తానికి ట్రైలర్ అనుకున్నంత కాకపోయినా ఒక మోస్తరుగా ఉందని నెటిజన్స్ అంటున్నారు. మరి ఈ సినిమాతో అనిల్ విజయపరంపరను కొనసాగిస్తాడా లేదా అనేది చూడాలి.