Mana Shankara Vara Prasad: మనశంకర వర ప్రసాద్ గారు.. తెలంగాణలో టికెట్ రూ.600
ABN , Publish Date - Jan 10 , 2026 | 12:13 PM
చిరంజీవి మనశంకర వర ప్రసాద్ గారు పండక్కి వస్తున్నారు సినిమా టికెట్ రేట్ల పెంపునకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
చిరంజీవి (chiranjeevi) హీరోగా అనీల్ రావిపూడి (anil ravipudi) దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం మనశంకర వర ప్రసాద్ గారు పండక్కి వస్తున్నారు (Mana Shankara Vara Prasad Garu). ఆదివారం జనవరి 11న ప్రేక్షకుల ఎదుకుటకు రానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదల చేసిన పోస్టర్స్, పాటలు ఒక దాన్ని మించి మరోటి విజయవంతమై సినిమాపై మంచి బజ్ తీసుకు వచ్చాయి. అంతేగాక చిరంజీవి చాలా రోజుల తర్వాత వింటేజ్ లుక్‌లో ఔట్ అండ్ ఔట్ ఫన్ జానర్ చేస్తుండడంతో ఆయన అభిమానులు, సినీ లవర్స్ సినిమా రాక కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
అయితే.. సినిమా టికెట్ రేట్లు రూ. 500కు పెంచుకోవడానికి ఇప్పటికే ఏపీలో జీవో రిలీజ్ చేయగా .. తాజాగా శనివారం తెలంగాణ ప్రభుత్వం కూడా టికెట్ రేట్లు పెంపునకు, 11న ఒక ప్రీమియర్ షోకు అనుమతినిస్తూ ప్రత్యేక జీవో రిలీజ్ చేసింది. ఈ జీవో ప్రకారం ప్రీమియర్స్ రోజున టికెట్ ధర రూ. 600 గా నిర్ణయించగా, 12 నుంచి సింగిల్ స్క్రీన్లలో రూ.50, మల్టీఫ్లెక్సులలో రూ.100 పెంచుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.