Mana Shankara VaraPrasad Garu: ఆ పాటల రైట్స్‌కు.. ఇంత ఖర్చు చేశారా! ఓ చిన్న.. సినిమానే తీయొచ్చుగా
ABN , Publish Date - Jan 13 , 2026 | 12:46 PM
ఇటీవల కొత్తగా తెరకెక్కుతున్న సినిమాల్లో తరుచూ వాడుతుండడం అనవాయితీగా మారిన సంగతి అందరికీ విధితమే.
పాత క్లాసిక్ హిట్ పాటలను ఇటీవల కొత్తగా తెరకెక్కుతున్న సినిమాల్లో తరుచూ వాడుతుండడం అనవాయితీగా మారిన సంగతి అందరికీ విధితమే. ఈ క్రమంలో ఇప్పటికే చాలా సినిమాల్లో ఓల్డ్ సాంగ్స్ రిమేక్ చేయడం ట్రెండ్‌గా మారింది. అవి సినిమాకు అదనపు ఆకర్షణను కూడా తీసుకువస్తున్నాయి. వాటిలో కొన్ని సినిమా విజయాలకు దోహదం చేస్తున్నాయి కూడా.
మరోవైపు అనుమతి లేకుండా డైరెక్ట్ పాటలను వాడుకున్న వారిపై ఇటీవల సంగీతం దర్శకుడు ఇళయ రాజా తరుచూ కేసులు వేయడం అవి కాస్త వివాదంగా మారి పాటలను తొలగించడమో లేక రాజాకు డబ్బులు ముట్ట జెప్పడమో జరిగిపోతూ ఉంది. తాజాగా డ్యూడ్ సినిమాలో ఇలానే ఇళయరాజా పాటలు వాడినందుకు ఆయన కోర్టుకు వెళ్లడం మేకర్స్ డబ్బులు కట్టడం కూడా అందరికీ తెలిసిన విషయమే..
అయితే.. ఇటీవల వచ్చిన కిరణ్ అబ్బవరం కే–రాంప్ (K-Ramp) సినిమాలో రాజశేఖర్ ‘ఆయుధం’ సినిమా నుంచి “ఇదేమిటమ్మా మాయ మాయ” అనే పాటను ఉపయోగించగా అది సినిమాను మించి ప్రాచూర్యం పొందడమే కాక ఆ సినిమా విజయంలో కీ రోల్ ప్లే చేసింది. ఆ తర్వాత కూడా ఇప్పటికీ ఎక్కడో ఓ చోట ఆ పాటను విరివిగా వాడుతూనే ఉన్నారు.
కాగా ఇప్పుడు ఈ కోవలోనే చిరంజీవి (chiranjeevi) ‘మన శంకర వర ప్రసాద్ గారు’ (Mana Shankara VaraPrasad Garu) చిత్రం కూడా ఆ జాబితాలో చేరింది. ఈ చిత్రంలోనే అనేక సందర్భాల్లో చిరంజీవి, వెంకటేశ్ సినిమాల పాటలను వాడేశారు. అందులో ఓ సీన్ విషయంలో తెలుగు, తమిళం, కన్నడ మూడు భాషలలో ఒకే బాణీలో ఉన్న ట్యూన్ అవసరం పడడంతో దళపతి సినిమా నుంచి సుందరీ నేనే నువ్వంటా అనే పాటను తీసుకున్నారు. ఇలా దాదాపు ఓ డజన్ రెట్రో సాంగ్స్‌ను ఈ సినిమాలో అయా సందర్భాల్లో ఉపయోగించి వీక్షకులకు నాస్టాల్జియా ఫీల్‌ను తీసుకువచ్చి రంజింప చేశారు.
ఇదిలాఉంటే.. సినిమాలో ఇలా పాత వీడియోలను వినియోగించినందుకు గాను పెద్ద మొత్తంలోనే చెల్లింపులు చేయాల్సి వచ్చినట్టు వినిపిస్తోంది. కేవలం వాటికే రూ. కోటి వరకు ఖర్చు చేసినట్లు సమాచారం. ఇప్పుడు వీరు చేసిన ఈ పనే ‘మన శంకర వర ప్రసాద్ గారు’ సినిమాకు పాత పాటల వినియోగం పూర్తిగా కలిసొచ్చింది. ఈ సినిమా విజయంలో స్టెయిట్ పాటలతో పాటు నాటి సంగీతం కూడా ప్రధాన భూమిక పోషించిందనడంలో అతిశయోక్తి లేదు. ముఖ్యంగా వెంకటేష్ రామ్మా చిలకమ్మ” పాటకు స్టెప్పులు వేస్తున్న సన్నివేశానికి థియేటర్లలో ప్రేక్షకులు విజిల్స్ పడుతున్నాయి. మున్ముందు మరిన్ని సినిమాలలోనూ ఇలాంటి పద్దతి కంటిన్యూ చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.