Mana Shankara Vara Prasad Garu: మన శంకర వరప్రసాద్.. టికెట్ రూ.500
ABN , Publish Date - Jan 10 , 2026 | 06:30 AM
మెగాస్టార్ చిరంజీవి 'మన శంకర వరప్రసాద్ గారు సినిమా ప్రత్యేక ప్రదర్శనకు ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
మెగాస్టార్ చిరంజీవి (chiranjeevi) కథానాయకుడిగా నటించిన 'మన శంకర వరప్రసాద్ గారు (Mana Shankara Vara Prasad Garu) సినిమా ప్రత్యేక ప్రదర్శనకు ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ నెల 12వ తేదీన విడుదలయ్యే ఈ సినిమాకు నిబంధనల సడలింపు ఇస్తూ టికెట్ ధరల పెంపునకు హోంశాఖ శుక్రవారం అనుమతి ఇచ్చింది.
తాజా ఉత్తర్వుల ప్రకారం.. ఈ నెల 11వ తేదీ సాయంత్రం 8 నుంచి రాత్రి 10 గంటల మధ్యలో ఒక ప్రత్యేక షోకు అనుమతి లభించింది. దీనికి గానూ టికెట్ ధర రూ.500గా నిర్ణయించారు. సినిమా విడుదలైన రోజు నుంచి పది రోజుల పాటు టికెట్ ధరలను పెంచుకునే అనుమతిని ప్రభుత్వం ఇచ్చింది.
సింగిల్ స్క్రీన్ లలో రూ.100, మల్టీ ప్లెక్సులలో రూ.125 అదనంగా వసూలు చేసుకునే వెసులుబాటును ఇస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.