MSG Team: సినిమా సక్సెస్ కావాలని శ్రీనివాసుని ఆశీస్సుల కోసం..

ABN , Publish Date - Jan 04 , 2026 | 12:31 PM

దర్శకుడు అనిల్ రావిపూడి  తిరుమల శ్రీవారిని  దర్శించుకున్నారు.

దర్శకుడు అనిల్ రావిపూడి (Anil Ravipudi) తిరుమల శ్రీవారిని  దర్శించుకున్నారు. ‘మన శంకర వరప్రసాద్’ (Mana Shankara Vara Prasad Garu) చిత్ర నిర్మాత సాహు గారపాటి, గేయ రచయిత రామజోగయ్య శాస్త్రితో కలిసి ఆదివారం ఉదయం వీఐపీ బ్రేక్  దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు.  అనంతరం..రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. చిరంజీవి, నయనతార జంటగా  నటించిన ‘మన శంకర వరప్రసాద్’ చిత్రం ఈ నెల 12న ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో శ్రీవారి ఆశీస్సుల కోసం తిరుమలకు  వచ్చినట్టు తెలిపారు. తిరుపతిలో ఆదివారం సాయంత్రం 4 గంటలకు సినిమా ట్రైలర్‌ను విడుదల చేయనున్నట్టు తెలిపారు. 

Updated Date - Jan 04 , 2026 | 12:34 PM