Ntr Dragon: మొన్న పృథ్వీరాజ్.. ఇప్పుడు టొవినో! నీల్ మామ.. ఫ్లానింగ్ మాములుగా లేదుగా
ABN , Publish Date - Feb 02 , 2026 | 10:03 AM
యంగ్ టైగర్ ఎన్టీఆర్, సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో రాబోతున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ 'డ్రాగన్'లోకి మలయాళ స్టార్ హీరో టోవినో థామస్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR), మాస్ పవర్.. సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ (Prashanth Neel) కాంబినేషన్ లో వస్తున్న చిత్రం ‘డ్రాగన్’ (Dragon). బాలీవుడ్ మూవీ ‘వార్ 2’ మిశ్రమ ఫలితం తర్వాత, తారక్ తన విశ్వరూపాన్ని చూపించేందుకు నీల్ తో జతకట్టడంతో అంచనాలు అంబరాన్ని తాకుతున్నాయి. ఇప్పుడు ఈ మూవీలోకి మలయాళ పవర్‌హౌస్ పెర్ఫార్మర్ టోవినో థామస్ (Tovino Thomas) ఎంట్రీ ఇస్తున్నారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో మంటలు పుట్టిస్తోంది. ఇద్దరు అద్భుతమైన నటుల మధ్య జరిగే ఆ ఎపిక్ ఫేస్-ఆఫ్ ఎలా ఉంటుందో ఊహించుకుంటేనే ఫ్యాన్స్‌కు పూనకాలు రావడం ఖాయం. ఇక ప్రశాంత్ నీల్ గత చిత్రాలు కేజీఎఫ్, సలార్ లను మించి ఎన్టీఆర్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు.
వాయిస్ 2: మలయాళంలో ‘మిన్నల్ మురళి’ సినిమాతో పాన్ ఇండియా గుర్తింపు తెచ్చుకున్న టోవినో థామస్. ప్రశాంత్ నీల్ మార్క్ పవర్ ఫుల్ విలన్ గా ఎన్టీఆర్ ను ఢీ కొట్టబోతున్నారు. నీల్ సినిమాల్లో ప్రతినాయకుడి పాత్ర ఎంత బలంగా ఉంటుందో అందరికీ తెలిసిందే. ఆ సీటులో టోవినో అంటే స్క్రీన్ మీద అగ్నిపర్వతం పేలాల్సిందే. గ్లోబల్ స్టార్ పవర్‌కు, మలయాళ స్టార్ యాక్టింగ్ తోడైతే వెండితెరపై యుద్ధం తథ్యమని సినీ అభిమానులు నమ్ముతున్నారు. ఇది కేవలం క్లాష్ కాదు, అసలైన మాస్ మాడ్‌నెస్! వీరిద్దరి మధ్య వచ్చే 'ఫేస్ ఆఫ్' సీన్లు థియేటర్లను షేక్ చేయడం ఖాయమని సినీ వర్గాల్లో వినిపిస్తోంది.
అయితే.. ఈ సాకి కేవలం యాక్షన్ మాత్రమే కాదు.. అంతకు మించిన ఒక పవర్ ఫుల్ ఎమోషనల్ డ్రామాతో ప్రశాంత్ నీల్ ఈ సారి మ్యాజిక్ చేయబోతున్నారు. ‘వార్-2’ మిగిల్చిన వేడిన చల్లార్చుతూ రికార్డుల సునామీతో బాక్సాఫీస్ ను షేక్ చేసేందుకు తారక్ సిద్ధమైయ్యాడు. మలయాళ వర్సటైల్ యాక్టర్ టోవినో థామస్ ఈ యుద్ధంలోకి అడుగుపెట్టడంతో, స్క్రీన్ మీద నట విస్ఫోటనం తథ్యమని సినీ వర్గాలు చెబుతున్నాయి. నీల్ మార్క్ డార్క్ విజువల్స్, నరాలను మెలిపెట్టే ఎమోషన్స్ తోడైతే, బాక్సాఫీస్ చరిత్రలో సరికొత్త రక్తచరిత్ర లిఖించబడటం ఖాయమని టాలీవుడ్ వర్గాల్లో టాక్ నడస్తోంది. మరి తారక్-నీల్ కాంబోలో బాక్సాఫీస్ వద్ద అభిమానుల అంచనాలను అందుకోవడంతో పాటు ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి. కాగా ఇటీవల టోవినో మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్ చేస్తున్న వీడియో తెగ వైరల్ అవగా డ్రాగన్ సినిమా కోసమే సిద్ధమవుతున్నట్లు సోషల్‌మీడియాలో తెగ ట్రెండ్ అయింది.