బుట్ట బొమ్మకు సీఎం కూడా హ్యాండిచ్చారా..?

ABN , Publish Date - Jul 22 , 2026 | 03:59 PM

ఒకప్పుడు టాలీవుడ్‌ను ఏలిన లక్కీ చార్మ్... వరస విజయాలతో గోల్డెన్ లెగ్ అనిపించుకున్న ముద్దుగుమ్మ పూజా హెగ్డే (Pooja Hegde)! ముగమూడి సినిమాతో కెరీర్ స్టార్ట్ చేసిన ఈ అందాల భామకు మొదట్లో విజయం దక్కడానికి ఐదేళ్లు పట్టింది.

Pooja Hegde

ఒకప్పుడు టాలీవుడ్‌ను ఏలిన లక్కీ చార్మ్... వరస విజయాలతో గోల్డెన్ లెగ్ అనిపించుకున్న ముద్దుగుమ్మ పూజా హెగ్డే (Pooja Hegde)! ముగమూడి సినిమాతో కెరీర్ స్టార్ట్ చేసిన ఈ అందాల భామకు మొదట్లో విజయం దక్కడానికి ఐదేళ్లు పట్టింది. కానీ దువ్వాడ జగన్నాథం పడిన ఒక్క బ్రేక్.. అమ్మడి లక్ గ్రాఫ్‌ను ఎక్కడికో తీసుకెళ్లిపోయింది. ఆ తర్వాత అలా వైకుంఠపురంలో వరకు వరసగా బాక్సాఫీస్ దగ్గర సంచలనాలు సృష్టించిన ఈ ముద్దుగుమ్మకు, ఆ తర్వాతి రోజుల్లో మాత్రం లక్ పెద్దగా వర్కవుట్ కాలేదు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా కాస్త ఊరటనిచ్చినా.. ఆ తర్వాత వచ్చిన భారీ ప్రాజెక్టులు ఒకదానిని మించి ఒకటి డిజాస్టర్లుగా నిలిచాయి. దాంతో కెరీర్ మళ్లీ ట్రాక్‌లో పడటానికి పూజా హెగ్డే తన ఆశలన్నీ పెట్టుకున్న చిత్రం జననాయగన్.


కోలీవుడ్‌లో భారీ అంచనాలతో వస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్డే ఓ జర్నలిస్ట్ పాత్రలో నటించింది. సెన్సార్ సమస్యలు, రకరకాల వాయిదాల తర్వాత ఎట్టకేలకు ఈ శుక్రవారం సినిమా థియేటర్లలోకి వచ్చేందుకు సిద్ధమైంది. అయితే ఇక్కడే అసలు కథ మొదలైంది! సినిమా రిలీజ్ ముంగిట పూజా హెగ్డేకు సంబంధించి ఒక షాకింగ్ వార్త వైరల్ అవుతోంది. ఈ సినిమాలో పూజా హెగ్డే నటించిన చాలా కీలకమైన సీన్లకు ఎడిటింగ్ టేబుల్ దగ్గర కత్తెర పడిందట. సినిమా లెంగ్త్ తగ్గించే క్రమంలో అమ్మడి పాత్రకు సంబంధించిన సీన్స్ ట్రిమ్ చేశారని సమాచారం.


అంతేకాదు, ఒక ఇంటర్వ్యూలో స్వయంగా దర్శకుడు హెచ్. వినోత్.. పూజా హెగ్డేకు బహిరంగంగా క్షమాపణలు చెప్పడం మరింత హాట్ టాపిక్‌గా మారింది. సీన్లు కట్ చేయాల్సి వచ్చినందుకు డైరెక్టర్ సారీ చెప్పారంటే.. పూజా హెగ్డే రోల్ నిడివి ఏ స్థాయిలో తగ్గిందో అర్థం చేసుకోవచ్చు. ఎంతో కష్టపడి చేసిన పాత్రకు ఇలా కత్తెర పడటం పూజా హెగ్డే అభిమానులను కలవరపెడుతోంది. దీనివల్ల జననాయగన్ హిట్ అయినా, పూజా హెగ్డే కెరీర్‌కు ఏమేరకు ఉపయోగపడుతుందనేది ఇప్పుడు సస్పెన్స్‌గా మారింది. ఇన్ని ప్లాప్ లు వచ్చినా అవకాశాలు మాత్రం తగ్గడంలేదు బుట్టబొమ్మకి. ప్రస్తుతం ముద్దుగుమ్మ చేతిలో దుల్కర్ సల్మాన్‌తో చేస్తున్న శ్రీశ్రీ చిత్రంతో పాటు, రాఘవ లారెన్స్ కాంచన-4, హాసిత్ గోలి వీరాధివీరులంట ప్రాజెక్టులు ఉన్నాయి. మరి ఈ రాబోయే సినిమాలైనా బుట్టబొమ్మకు మళ్లీ ఆ పాత వైభవాన్ని, గోల్డెన్ విజయాన్ని తెచ్చిపెడతాయో లేదో వేచి చూడాలి.

Updated Date - Jul 22 , 2026 | 04:05 PM